ఒక్క పరుగు దూరంలో.. సరికొత్త రికార్డు!

| Edited By: Srinu

Jul 13, 2019 | 7:38 PM

మాంచెస్టర్‌: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రపంచకప్ లో సరికొత్త రికార్డు సృష్టించడానికి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్ లో అతడు ఈ ఫీట్ సాధించే అవకాశముంది. కివీస్ జట్టు ఫైనల్ వరకు చేరడంలో కీలకపాత్ర పోషించాడు కేన్ విలియమ్సన్. ఇకపోతే ఫైనల్‌‌లో కూడా అద్భుతంగా రాణించి కివీస్ విశ్వవిజేతగా స్వదేశానికి రావాలని న్యూజిలాండ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డు […]

ఒక్క పరుగు దూరంలో.. సరికొత్త రికార్డు!
Follow us on

మాంచెస్టర్‌: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రపంచకప్ లో సరికొత్త రికార్డు సృష్టించడానికి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్ లో అతడు ఈ ఫీట్ సాధించే అవకాశముంది. కివీస్ జట్టు ఫైనల్ వరకు చేరడంలో కీలకపాత్ర పోషించాడు కేన్ విలియమ్సన్. ఇకపోతే ఫైనల్‌‌లో కూడా అద్భుతంగా రాణించి కివీస్ విశ్వవిజేతగా స్వదేశానికి రావాలని న్యూజిలాండ్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించేందుకు విలియమ్సన్ ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన అతడు 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో మొత్తం 548 పరుగులు చేసి శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే రికార్డును సమం చేశాడు. అటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 9 ఇన్నింగ్స్‌లో 539 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చూస్తుంటే విలియమ్సన్ ఒక్క పరుగు చేస్తే వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా కొత్త రికార్డు సృష్టిస్తాడు.

మరోవైపు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రపంచకప్‌లో 5 సెంచరీలు చేసి రికార్డు సృష్టించిన విషయం విదితమే. అతడు ఈ సిరీస్‌లో మొత్తం 648 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.