AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: సన్‌రైజర్స్ వదులుకునే ప్లేయర్స్ వీరేనా.. మినీ వేలానికి ముందు కేన్ మామకు షాక్.?

ఐపీఎల్ 2023 మినీ వేలానికి సర్వం సిద్దమవుతోంది. బీసీసీఐ చెప్పిన డెడ్‌లైన్ ప్రకారం ఫ్రాంచైజీలు అన్నీ కూడా వదులుకునే ప్లేయర్స్‌కు సంబంధించిన..

IPL 2023: సన్‌రైజర్స్ వదులుకునే ప్లేయర్స్ వీరేనా.. మినీ వేలానికి ముందు కేన్ మామకు షాక్.?
Sunrisers Hyderabad
Ravi Kiran
|

Updated on: Nov 14, 2022 | 12:22 PM

Share

ఐపీఎల్ 2023 మినీ వేలానికి సర్వం సిద్దమవుతోంది. బీసీసీఐ చెప్పిన డెడ్‌లైన్ ప్రకారం ఫ్రాంచైజీలు అన్నీ కూడా వదులుకునే ప్లేయర్స్‌కు సంబంధించిన జాబితాను రెడీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే సీజన్‌కు కేన్ విలియమ్సన్‌ను పక్కన పెట్టాలని సన్‌రైజర్స్ యాజమాన్యం భావిస్తోన్న సమాచారం. కేన్‌ను వేలంలో విడుదల చేయాలనీ భావిస్తున్నట్లు ఓ క్రీడా వెబ్‌సైట్ కథనంలో పేర్కొంది.

మరోవైపు గత సీజన్‌లో అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాటర్‌గా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌లు ఆడి 19.63 సగటున కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. ఇక సన్‌రైజర్స్‌ గత సీజన్‌ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. ఈ ఫెయిల్యూర్స్‌ను కారణంగా చూపి ఉద్వాసన పలకాలని సన్‌రైజర్స్ యాజమాన్యం అనుకుంటున్నట్లు సమాచారం.

కేన్‌తో పాటు రొమారియో షెపర్డ్, జగదీశ్‌ సుచిత్, కార్తీక్ త్యాగి, సీన్ అబాట్, శశాంక్ సింగ్, ఫజల్‌ హక్ ఫారూఖీ, అబ్దుల్ సమద్, శ్రేయాస్ గోపాల్‌లను సన్‌రైజర్స్ యాజమాన్యం వదిలేయనున్నట్లు సమాచారం. మరి కేన్ విలియమ్సన్‌ను హైదరాబాద్ జట్టు అట్టిపెట్టుకుంటుందో.. వదిలేస్తుందో తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా, డిసెంబర్ 23వ తేదీన కొచ్చిలో ఐపీఎల్ మినీ వేలం జరగనుండగా.. ఫ్రాంచైజీలు ప్లేయర్స్‌ను రిలీజ్ చేసే డెడ్‌లైన్‌ను నవంబర్ 15గా నిర్ణయించింది బీసీసీఐ.