Video: ఎవర్రా సామీ.. 11 ఫోర్లు, 11 సిక్సర్లతో ఉగ్రరూపం.. 47 బంతుల్లోనే..
Jordan Cox Hits Century: 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎసెక్స్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు త్వరగానే అవుటయ్యారు. అయితే, క్రీజులోకి వచ్చిన జార్డాన్ కాక్స్ పరిస్థితిని చక్కదిద్ది, ఒంటరి పోరాటం చేశాడు. అతను కేవలం 60 బంతుల్లో 11 ఫోర్లు, 11 సిక్సర్లతో 139 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Jordan Cox Hits Century: టీ20 బ్లాస్ట్ (Vitality Blast) 2025 సీజన్‌లో ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఎసెక్స్ జట్టు హ్యాంప్‌షైర్ హాక్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంలో ఎసెక్స్ బ్యాట్స్‌మెన్ జోర్డాన్ కాక్స్ (Jordan Cox) అద్భుతమైన శతకంతో కీలక పాత్ర పోషించాడు. అతని వీరోచిత ఇన్నింగ్స్‌తో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎసెక్స్ ఛేదించగలిగింది.
హ్యాంప్‌షైర్ భారీ స్కోరు..
మొదట బ్యాటింగ్ చేసిన హ్యాంప్‌షైర్ హాక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరును సాధించింది. టోబి ఆల్బర్ట్ (Toby Albert) 55 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 84 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. హిల్‌టన్ కార్ట్‌రైట్ (Hilton Cartwright) కేవలం 23 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. దీంతో హ్యాంప్‌షైర్ భారీ స్కోరును నమోదు చేయగలిగింది.
కాక్స్ వీరోచిత ఇన్నింగ్స్..
View this post on Instagram
221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎసెక్స్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు త్వరగానే అవుటయ్యారు. అయితే, క్రీజులోకి వచ్చిన జార్డాన్ కాక్స్ పరిస్థితిని చక్కదిద్ది, ఒంటరి పోరాటం చేశాడు. అతను కేవలం 60 బంతుల్లో 11 ఫోర్లు, 11 సిక్సర్లతో 139 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాక్స్ బ్యాట్ నుంచి వచ్చిన ప్రతి షాట్ అభిమానులను ఉర్రూతలూగించింది. అతను కేవలం 47 బంతుల్లోనే తన తొలి టీ20 శతకాన్ని పూర్తి చేసుకుని, ఎసెక్స్ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు.
చివరి ఓవర్‌లో ఎసెక్స్‌కు విజయానికి 11 పరుగులు అవసరం కాగా, జార్డాన్ కాక్స్ తొలి రెండు బంతుల్లోనే రెండు భారీ సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎసెక్స్ జట్టు నాలుగు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో ఎసెక్స్‌కు ఇది మూడో విజయం మాత్రమే అయినప్పటికీ, జార్డాన్ కాక్స్ శతకం వారికి చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
టోబీ ఆల్బర్ట్ ఇన్నింగ్స్ వృధా..
టాస్ గెలిచిన ఎసెక్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 220 పరుగులు చేసింది. జట్టు తరపున ఓపెనర్ టోబీ ఆల్బర్ట్ 55 బంతుల్లో 1 సిక్స్, 12 ఫోర్లతో 84 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాటు, హిల్టన్ కార్ట్‌రైట్ కేవలం 23 బంతుల్లో 5 సిక్స్, 3 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. టామ్ ప్రెస్ట్ 24 బంతుల్లో 41 పరుగులు చేసి తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఎసెక్స్ తరపున మెకెంజీ జోన్స్, కెప్టెన్ సైమన్ హార్మర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. మొహమ్మద్ ఆమిర్ ఒక వికెట్ తీశారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




