కోల్‌కతాపై హైదరాబాద్‌ ఘన విజయం

ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. బెయిర్‌స్టో(80, 43 బంతుల్లో 7×4, 4×6), డేవిడ్‌వార్నర్‌(67, 38 బంతుల్లో 3×4, 5×6) అర్ధశతకాలతో చెలరేగడంతో 15 ఓవర్లకే గెలుపొందింది. చివర్లో వార్నర్‌ ఔటైనా, బెయిర్‌స్టో, విలియమ్సన్‌(8) లాంఛనాన్ని పూర్తిచేశారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో […]

కోల్‌కతాపై హైదరాబాద్‌ ఘన విజయం

Edited By:

Updated on: Apr 21, 2019 | 7:45 PM

ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. బెయిర్‌స్టో(80, 43 బంతుల్లో 7×4, 4×6), డేవిడ్‌వార్నర్‌(67, 38 బంతుల్లో 3×4, 5×6) అర్ధశతకాలతో చెలరేగడంతో 15 ఓవర్లకే గెలుపొందింది. చివర్లో వార్నర్‌ ఔటైనా, బెయిర్‌స్టో, విలియమ్సన్‌(8) లాంఛనాన్ని పూర్తిచేశారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్‌ క్రిస్‌లిన్‌(51) అర్ధశతకంతో ఆ జట్టుని ఆదుకోవడంతో ఆ మాత్రం స్కోర్‌ సాధించింది. సునిల్‌ నరైన్‌(25), రింకుసింగ్‌(30) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేదు. రసెల్‌ చివర్లో రెండు సిక్సులు బాదినా భారీ స్కోర్‌ చెయ్యలేదు. దీంతో కోల్‌కతా ఎనిమిది వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్‌ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.