AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

0, 0, 0, 0, 0, 0.. ప్రపంచ రికార్డుతో సరికొత్త చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. అదేంటంటే?

Jasprit Bumrah World Record: అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. అఫ్గానిస్థాన్ (Afghanistan) జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌ను మెయిడెన్‌గా వేసి, ఐసీసీ పూర్తి స్థాయి సభ్య దేశాల బౌలర్లలో అత్యధిక మెయిడెన్లు వేసిన ఆటగాడిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

0, 0, 0, 0, 0, 0.. ప్రపంచ రికార్డుతో సరికొత్త చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. అదేంటంటే?
Jasprit Bumrah World Record
Venkata Chari
|

Updated on: Sep 15, 2026 | 8:25 PM

Share

Jasprit Bumrah World Record: భారత క్రికెట్ జట్టు (Team India) స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు బుమ్రా అద్భుతమైన ఆరంభాన్ని అందించాడుఒక్క పరుగు కూడా తీయలేకపోయారు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఒక మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను బుమ్రా మెయిడెన్‌గా ముగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనతో ఆయన పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

ఈ విలక్షణ ప్రదర్శనతో అంతర్జాతీయ టీ20లలో బుమ్రా వేసిన మొత్తం మెయిడెన్ ఓవర్ల సంఖ్య 13కు చేరింది. తద్వారా ఐసీసీ (International Cricket Council – ICC) పూర్తి స్థాయి సభ్య దేశాల జాబితాలో అత్యధిక మెయిడెన్ ఓవర్లు నమోదు చేసిన బౌలర్‌గా ఆయన చరిత్ర సృష్టించాడు. గతంలో 12 మెయిడెన్లతో జింబాబ్వే (Zimbabwe) పేసర్ రిచర్డ్ నగరవ (Richard Ngarava) తో సమానంగా ఉన్న బుమ్రా, తాజా ప్రదర్శన ద్వారా ఆ రికార్డును అధిగమించి ఏకైక అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: మేమైతే గెలిచాం.. అతనిపై ఇక నమ్మకం లేదు.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి తీసేసుడే: శ్రేయాస్ అయ్యర్

భారత బౌలింగ్ విభాగంలో మ్యాచ్ తొలి ఓవర్‌నే మెయిడెన్‌గా వేసిన ఆటగాళ్ల జాబితాలోనూ బుమ్రా కొత్తగా చేరాడు. ఈ విభాగంలో భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) ఆరు సార్లు ఈ ఘనత సాధించి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) రెండు సార్లు ఈ ఫీట్ సాధించగా, హర్భజన్ సింగ్ (Harbhajan Singh), హార్దిక్ పాండ్యా (Hardik Pandya), అక్షర్ పటేల్ (Axar Patel), దీపక్ చాహర్ (Deepak Chahar), మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj), ఆశిష్ నెహ్రా (Ashish Nehra), ప్రవీణ్ కుమార్ (Praveen Kumar), బరీందర్ స్రాన్ (Barinder Sran) ఒక్కోసారి తొలి ఓవర్ మెయిడెన్ వేశారు. తాజా ప్రదర్శనతో బుమ్రా కూడా ఈ ప్రత్యేక జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: వైభవ్ ఆటకట్టిస్తాం.. పక్కాప్లాన్‌తో దూల తీర్చేస్తాం..: జపాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us