
Team India: టీమ్ ఇండియా ఆసియా కప్ (Asia Cup 2023), ప్రపంచ కప్ (ODI World Cup 2023) కోసం సిద్ధమవుతోంది. అన్ని విభాగాల్లో జట్టును బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికి తోడు గాయంతో జట్టుకు దూరమైన ఆటగాళ్లు ఇప్పుడు ఒక్కొక్కరుగా జట్టులోకి వస్తున్నారు. ఇది జట్టుకు బలం చేకూర్చింది. దీనితో పాటు, కొత్త అంశం తెరపైకి వచ్చింది. జట్టు వైస్ కెప్టెన్ మారబోతున్నట్లు వార్తా సంస్థ PTI నివేదించింది. ప్రస్తుతం టీమ్ ఇండియా (Team India) వన్డే జట్టు కెప్టెన్సీ రోహిత్ శర్మ (Rohit Sharma) చేతిలో ఉండగా, హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వైస్ కెప్టెన్‌గా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. తాజా వార్తల ప్రకారం జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్, ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా వైస్ కెప్టెన్‌గా కనిపించవచ్చని పీటీఐ నివేదించింది.
ఏడాది తర్వాత టీమ్ ఇండియాకు పునరాగమనం చేసిన బుమ్రాకు ఐర్లాండ్ పర్యటనలో జట్టులో అవకాశం కల్పించడంతో పాటు కెప్టెన్సీ కూడా అప్పగించారు. దీనికి బుమ్రా కోరికే ప్రధాన కారణమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నివేదిక ప్రకారం, బుమ్రా స్వయంగా కెప్టెన్సీపై ఆసక్తి కలిగి ఉన్నాడంట. అందుకే అతనికి ఈ బాధ్యతను అప్పగించారనే వార్తలు వినిపిస్తున్నాయి.
టీ20ల్లో తొలి విజయం అందుకున్న కెప్టెన్ బుమ్రా..
లేకుంటే ఐర్లాండ్ పర్యటనకు రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టుకు కెప్టెన్‌గా చేయాలన్నది బోర్డు ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో రుతురాజ్ ఆసియా క్రీడలకు పూర్తిగా సిద్ధమవుతాడు. కానీ, బుమ్రా జట్టుకు నాయకత్వం వహించాలని తన కోరికను వ్యక్తం చేయడంతో, అతనికి బాధ్యతలు అప్పగించారు.
కొత్త ఆలోచన ప్రకారం ఐర్లాండ్ పర్యటనలో జట్టుకు నాయకత్వం వహిస్తున్న బుమ్రాకు టీమిండియా వన్డే జట్టు వైస్ కెప్టెన్సీ దక్కనుంది. దీంతో ఈ స్థానం కోసం ప్రస్తుతం వన్డే జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా, బుమ్రా మధ్య పోటీ నెలకొంది. దీంతో పీటీఐ తన నివేదికలో బుమ్రా, పాండ్యా మధ్య పోటీలో జస్ప్రీత్ విజయం సాధించడం ఖాయమని, ఆసియా కప్, ప్రపంచ కప్‌లో బుమ్రాను టీమ్ ఇండియా వైస్ కెప్టెన్‌గా చేయవచ్చని పేర్కొంది.
బుమ్రా నాయకత్వ పాత్రలో సీనియర్‌గా ఉండడమే దీనికి ప్రధాన కారణం. నిజానికి, 2022లో దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన వన్డే సిరీస్‌లో బుమ్రా టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తరువాత జులై 2022 లో అతను ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కూడా జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి ఆసియాకప్‌లో అవకాశం దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
అదే సమయంలో ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ మారితే రోహిత్ తర్వాత వన్డే జట్టుకు బుమ్రానే కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది. హార్దిక్ ప్రస్తుతం టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో మంచి ఆరంభాన్ని పొందాడు. అయితే, బలహీనమైన వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ ఓటమిలో అతని కెప్టెన్సీ కూడా సందేహాస్పదంగా ఉంది. అక్కడ అతని కొన్ని నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..