అటు టీమిండియా, ఇటు ఐపీఎల్ ఛీ కొట్టాయి.. కట్‌చేస్తే.. 400 వికెట్లు, 6000 పరుగులతో చరిత్ర సృష్టించాడుగా

Ranji Trophy History: రంజీ ట్రోఫీలో జలజ్ సక్సేనా మరోసారి తన సత్తా చాటాడు. యూపీతో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టిన ఈ ఆటగాడు రంజీ ట్రోఫీలో 400 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు. దీంతో రంజీ ట్రోఫీలోనూ భారీ రికార్డు సృష్టించాడు.

అటు టీమిండియా, ఇటు ఐపీఎల్ ఛీ కొట్టాయి.. కట్‌చేస్తే.. 400 వికెట్లు, 6000 పరుగులతో చరిత్ర సృష్టించాడుగా
Jalaj Saxena
Follow us

|

Updated on: Nov 06, 2024 | 6:32 PM

Jalaj Saxena: రంజీ ట్రోఫీ జరుగుతోంది. కేరళకు చెందిన ఓ ఆల్ రౌండర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి సరికొత్త రికార్డ్‌ను లిఖించాడు. త్రివేండ్రంలో యూపీతో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో జలజ్ సక్సేనా ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో రంజీ ట్రోఫీలో జలజ్ 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో 400 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా జలజ్ సక్సేనా నిలిచాడు.

జలజ్ సక్సేనా అద్భుత రికార్డ్..

జలజ్ సక్సేనా భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో దిగ్గజ ఆల్ రౌండర్ల కోవకు చెందినవాడు. ఈ ఆటగాడు 143 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 6795 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 14 సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో, అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 457 వికెట్లు పడగొట్టాడు. ఇందులో అతను రంజీ ట్రోఫీలో 400 వికెట్లు తీశాడు. అయితే, ఇంత గొప్ప ప్రదర్శన చేసినప్పటికీ ఈ ఆటగాడికి టీమ్ఇండియాలో చోటు దక్కలేదు. ఐపీఎల్‌లోనూ చోటుదక్కలేదు. జలజ్ ఇప్పటివరకు ఒకే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. 2021లో పంజాబ్ కింగ్స్ అతనికి ఈ అవకాశం ఇచ్చింది. అయితే, ఒక్క మ్యాచ్ తర్వాత ఏ మ్యాచ్ ఆడలేకపోయాడు.

యూపీలో కలకలం..

జలజ్ సక్సేనా యూపీ బ్యాట్స్ మెన్ ను కూడా ఊపిరి పీల్చుకోనివ్వలేదు. త్రివేండ్రంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో జలజ్ ఒంటిచేత్తో యూపీ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్‌ను చిత్తు చేశాడు. యూపీ కెప్టెన్ ఆర్యన్ జుయాల్ కు జలద్ బౌలింగ్ చేశాడు. సిద్ధార్థ్ యాదవ్, పీయూష్ చావ్లా బౌలింగ్‌లో జలజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో జలజ్ సక్సేనా 29వసారి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు 18 వేర్వేరు జట్లపై ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ విషయంలో రాజస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ పంకజ్ సింగ్ ను సమం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..