AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mystery Spinner : ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్.. టీమిండియాలో చోటు గల్లంతేనా?

Mystery Spinner : ఐపీఎల్ 2026, టీ20 ప్రపంచకప్‌లో వరుణ్ చక్రవర్తి పేలవ ప్రదర్శన కేకేఆర్, టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. వికెట్లు తీయలేక, పరుగులు ధారాళంగా ఇస్తూ వరుణ్ ఫామ్ కోల్పోయాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కేవలం 7 ఓవర్లు వేసిన వరుణ్, ఏకంగా 79 పరుగులు సమర్పించుకున్నాడు.

Mystery Spinner : ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్.. టీమిండియాలో చోటు గల్లంతేనా?
4. వరుణ్ చక్రవర్తి: టీ20 వరల్డ్ కప్ విజయంలో భాగస్వామి అయిన వరుణ్ చక్రవర్తి, ఐపీఎల్‌లో కేకేఆర్ ప్రధాన స్పిన్నర్. మిడిల్ ఓవర్లలో పరుగులు నియంత్రించడంతో పాటు, కీలక వికెట్లు తీయడంలో వరుణ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్న ఇతను, ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలుగా మారనున్నాడు.
Rakesh
|

Updated on: Apr 07, 2026 | 8:23 AM

Share

Mystery Spinner : ఒకప్పుడు తన మిస్టరీ స్పిన్‌తో ప్రపంచ స్థాయి బ్యాటర్లను గజగజ వణికించిన వరుణ్ చక్రవర్తి, ఇప్పుడు ఫామ్ లేక విలవిలలాడుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు వెన్నెముకలా ఉండే ఈ స్పిన్నర్, ఐపీఎల్ 2026 సీజన్‌లో పూర్తిగా తేలిపోవడమే కాకుండా, టీమిండియాలో తన చోటును కూడా ప్రమాదంలో పడేసుకున్నాడు. వరుణ్ బౌలింగ్‌లో ఆ పదును తగ్గిందా? లేక బ్యాటర్లు అతడి గుట్టు కనిపెట్టేశారా? అనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ ఏడాది ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లను గమనిస్తే, వరుణ్ చక్రవర్తి ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. తన మ్యాజిక్ బౌలింగ్‌తో మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేసే వరుణ్, ఇప్పుడు రన్ మెషీన్‌లా మారిపోయాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కేవలం 7 ఓవర్లు వేసిన వరుణ్, ఏకంగా 79 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్ల వేటలోనూ వెనుకబడి కేవలం ఒకే ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. దీనివల్ల కేకేఆర్ జట్టు మిడిల్ ఓవర్లలో భారీగా పరుగులు ఇస్తూ మూల్యం చెల్లించుకుంటోంది.

కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు, అంతకుముందు జరిగిన టీ20 ప్రపంచకప్ 2026లో కూడా వరుణ్ చక్రవర్తి ఆట తీరు టీమిండియాను నిరాశపరిచింది. ప్రపంచ స్థాయి బ్యాటర్ల ముందు అతడి మిస్టరీ స్పిన్ ఏమాత్రం పనిచేయలేదు. బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను సులభంగా రీడ్ చేస్తూ భారీ షాట్లు ఆడారు. ఆ సమయంలో మిగిలిన బౌలర్లు రాణించడంతో వరుణ్ వైఫల్యం పెద్దగా బయటపడలేదు కానీ, ఇప్పుడు ఐపీఎల్‌లో అతడి అసలు రంగు బయటపడుతోంది.

గత ఆరు టీ20 మ్యాచ్‌లను విశ్లేషిస్తే వరుణ్ చక్రవర్తి ఎంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడో అర్థమవుతుంది. ఈ 6 మ్యాచ్‌ల్లో 23 ఓవర్లు వేసిన వరుణ్, ఏకంగా 273 పరుగులు ఇచ్చాడు. అంటే అతడి ఎకానమీ రేటు దాదాపు 11గా ఉంది. టీ20 క్రికెట్‌లో ఒక స్పిన్నర్‌కు ఇంతటి భారీ ఎకానమీ ఉండటం అంటే అది అతడి కెరీర్‌కు గొడ్డలి పెట్టు లాంటిదే. వికెట్లు తీయడంలోనూ, పరుగులను నియంత్రించడంలోనూ వరుణ్ పూర్తిగా విఫలమవుతున్నాడు.

మిస్టరీ గుట్టు విప్పేసిన బ్యాటర్లు?

వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఏదో మిస్టరీ ఉందని గతంలో అంతా భావించేవారు. కానీ ఇప్పుడు బ్యాటర్లు అతడి వేళ్లను, బంతిని వదిలే విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే అతడు వేసే వేరియేషన్లను పసిగట్టి బ్యాటర్లు కనికరం లేకుండా బాదేస్తున్నారు. ఒకవేళ ఐపీఎల్ 2026 అంతా ఇదే పరిస్థితి కొనసాగితే, కేకేఆర్ జట్టు అతడిని పక్కన పెట్టే అవకాశం ఉంది. అలాగే టీమిండియాలో కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ వంటి స్పిన్నర్లు పోటీలో ఉండటంతో వరుణ్ తన ప్లేస్ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us