Irfan Pathan: ఆ సిరీస్‌లో పాల్గొన్న మరో మాజీ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో మరికొంత మంది..

Coronavirus - Irfan Pathan: మాజీ క్రికెటర్లను కరోనా వెంటాడుతోంది. రోడ్డు సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న వారికి వరుసగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అవుతుండటంతో..  పలువురు

Irfan Pathan: ఆ సిరీస్‌లో పాల్గొన్న మరో మాజీ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో మరికొంత మంది..
Irfan Pathan
Follow us

|

Updated on: Mar 30, 2021 | 1:28 AM

Coronavirus – Irfan Pathan: మాజీ క్రికెటర్లను కరోనా వెంటాడుతోంది. రోడ్డు సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న వారికి వరుసగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అవుతుండటంతో..  పలువురు క్రీడాకారుల్లో ఆందోళన మరింత పెరిగింది. శుక్రవారం క్రికెట్ మాజీ దిగ్గజం.. సచిన్ టెండూల్కర్‌కు, ఆ తర్వాత శనివారం మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్‌కు, ఆదివారం మాజీ బ్యాట్స్‌మన్‌ ఎస్‌.బద్రీనాథ్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం మరో మాజీ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు కూడా కరోనా సోకింది. పరీక్షలు చేయించుకోగా.. సోమవారం కోవిడ్ -19 పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు ఇర్ఫాన్ పఠాన్ ట్విట్ చేసి వెల్లడించారు. ఎలాంటి లక్షణాలు లేవని.. అయినప్పటికీ కరోనా నిర్ధారణ కావడంతో.. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించాడు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అందరూ మాస్కులు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని కోరాడు. తాజాగా ఇర్ఫాన్ పఠాన్‌కు కోవిడ్ సోకడంతో.. రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో పాల్గొన్న వారిలో కరోనా సోకిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.

ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్, యూసఫ్ పఠాన్, బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్ పాల్గొన్నారు. వీరంతా ఇండియా లెజెండ్స్ తరుపున ఆడారు. అయితే అందరూ డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నారు. వారితో పాటు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ లాంటి లెజెండరీ మాజీ ఆటగాళ్లు కూడా ఈ సిరీస్‌లో పాల్గొన్నారు. అయితే ఈ టోర్నీలో పాల్గొన్న నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో పలువురు మాజీ ఆటగాళ్లల్లో భయం మొదలైంది. అయితే.. రాయ్‌పుర్‌లో జరిగిన రోడ్‌సేఫ్టీ సిరీస్‌కు వేల సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించారు. అక్కడ కోవిడ్ నిబంధనలేవీ పాటించలేదని.. నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఎంతమందికి కరోనా సోకుతుందోనని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

Sachin Tendulkar : క్రికెట్ గాడ్, టీమిండియా మాజీ ఓపెనర్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్..( వీడియో )

Subramaniam Badrinath: మరో మాజీ క్రికెటర్‌కు కరోనా.. ఆందోళనలో పలువురు స్టార్ ఆటగాళ్లు