IPL 2025: ముంబై మాజీ కెప్టెన్ ని హత్తుకున్న మాస్టర్ బ్లాస్టర్! MI ఫ్యాన్స్ కి ఎమోషనల్ మూమెంట్స్
ముంబై ఇండియన్స్ KKRపై అద్భుత విజయం సాధించిన తర్వాత, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మెంటార్ సచిన్ టెండూల్కర్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన దృశ్యం వైరల్ అయింది. రోహిత్ ఈ సీజన్‌లో ఫామ్ కోసం పోరాడుతుండటంతో, అభిమానులు సచిన్ ఇచ్చిన మార్గదర్శకత వల్ల అతను మళ్లీ పుంజుకుంటాడా? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముంబై తమ విజయంతో సీజన్‌లో తిరిగి ఆశలు పెరిగాయి. కానీ, రోహిత్ మళ్లీ తన బ్యాటింగ్ టచ్‌ను తిరిగి తెచ్చుకుంటాడా అనేది చూడాలి!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో ముంబై ఇండియన్స్ (MI) ఎప్పుడూ నెమ్మదిగా ఆరంభించే జట్టుగా పేరుగాంచింది. ఈసారి కూడా అదే జరిగింది. అయితే, నిన్న వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి, ముంబై ఈ సీజన్‌లో తమ తొలి గెలుపును నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు అద్భుతంగా రాణించారు. KKRను కేవలం 116 పరుగులకే ఆలౌట్ చేసి, ఆ తర్వాత 12.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు. ఈ విజయంలో అరంగేట్ర బౌలర్ అశ్వనీ కుమార్ నాలుగు వికెట్లు తీసి స్టార్ ప్లేయర్‌గా నిలిచాడు. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీసి ముంబై విజయాన్ని సులభతరం చేశాడు.
ఈ విజయంతో ముంబై డగౌట్‌లో పెద్ద ఉపశమనం కనిపించింది. జట్టు యజమానులతో పాటు ఆటగాళ్ల ముఖాల్లో కూడా గెలుపు ఆనందం తళుక్కుమంది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ మెంటార్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో ప్రత్యేకంగా మాట్లాడుతున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 13 పరుగులకే ఔటయ్యాడు. గత మూడు మ్యాచ్‌లలో అతని బ్యాట్ నుంచి మొత్తం 21 పరుగులే వచ్చాయి, ఇది ముంబై అభిమానులను కలవరపెడుతోంది. ముఖ్యంగా అతని స్థాయికి తగ్గట్లు రాణించకపోవడం ముంబై జట్టుకు ఆందోళన కలిగించే విషయం.
ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మతో మాట్లాడుతుండటం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఆప్యాయంగా మాటలు చెప్పడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇది అభిమానుల హృదయాలను హత్తుకుంది.
IPL 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. మొదటి రెండు మ్యాచుల్లో CSK, GT చేతిలో ఓటమి పాలై ఆపై KKR పై భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఈ విజయంతో ముంబై మళ్లీ పుంజుకునే అవకాశాన్ని అందుకుంది. కానీ, రోహిత్ శర్మ ఫామ్‌పై అభిమానుల్లో ఇంకా సందేహాలే ఉన్నాయి. టెండూల్కర్ అతనికి ఇచ్చిన మార్గదర్శకత వల్ల రోహిత్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడా? ముంబై ఈ సీజన్‌లో ట్రోఫీ గెలవగలదా? చూడాలి!
Rohit Sharma hugs Sachin Tendulkar. ❤️ pic.twitter.com/zTcTgJz848
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



