
దాదాపు ఆరేళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. కచ్చితంగా ఐపీఎల్ ట్రోఫీ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. అప్పుడెప్పుడూ 2016లో హైదరాబాద్ జట్టును ఐపీఎల్ ఛాంపియన్‌ను చేశాడు డేవిడ్ వార్నర్. ఇక ఇప్పుడు మళ్లీ అదే ఆసీస్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్.. ఆ ఫీట్ సాధించాలని చూస్తున్నాడు. గత మూడు సీజన్లుగా విఫలమవుతూ.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంటూ వస్తోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ ఏడాది ఒక్కసారిగా విజృంభించింది. ప్రత్యర్ధులను ఊచకోత కోస్తూ.. ఫైనల్‌కి చేరింది. మరికొన్ని గంటల్లో చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్‌తో తుదిపోరుకు సిద్దమవుతోంది. ఇదిలా ఉంటే.. కీలక ఫైట్‌కు ముందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఆ ఇద్దరు ప్లేయర్స్ చికాకు పుట్టిస్తున్నారు. వారి ఆటతీరుతో ఫ్యాన్స్‌కు విలన్లుగా మారారు. మరి వారెవరో కాదు.. అబ్దుల్ సమద్, ఐడెన్ మార్క్‌రమ్.
మొదటిగా అబ్దుల్ సమద్ విషయానికొస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇతడ్ని ఫినిషింగ్ రోల్ కోసం అట్టేపెట్టుకుంది. అయితే ఈ సీజన్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. 15 మ్యాచ్‌ల్లో కేవలం 178 పరుగులు చేయడం మాత్రమే కాదు.. అత్యంత కీలకమైన మ్యాచ్ అయిన.. క్వాలిఫయర్ 2లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఇక ఐడెన్ మార్క్‌రమ్.. SAటీ20 టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించి.. కప్పు అందించిన ఈ ప్లేయర్.. ఐపీఎల్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఏకంగా క్వాలిఫయర్ 2లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి.. అనవసరపు షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. ఇంత సీనియర్ ప్లేయర్ అయి ఉండి.. అతడు ఆడే పేలవ షాట్స్‌కి విమర్శల పాలవుతున్నాడు.
దీంతో ఈ ఇద్దరు ఫైనల్‌లో తుది జట్టులో ఉంటే కప్పు కష్టమే అని SRH ఫ్యాన్స్ అంటున్నారు. వారి స్థానంలో వేరే ప్లేయర్స్‌కి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. బెంచ్‌కే పరిమితమైన ఫిలిప్స్, అలాగే వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వస్తే.. అటు బ్యాట్.. ఇటు బంతితో ఉపయోగపడతారని ఆశిస్తున్నారు.