IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ IPL 2025 వేలంలో కీలక ప్రసంగం చేస్తున్నారు.
IPL Mega Auction 2025 Live: ముగిసిన సెట్ 2.. భారత ఆటగాళ్లదే హవా
IPL Mega Auction 2025 Live: ఐపీఎల్ 18వ సీజన్ కోసం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగుతోంది. ఈ వేలం నుంచి మొత్తం 204 మంది ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు.
LIVE NEWS & UPDATES
-
మార్క్యూ సెట్ 2 తర్వాత ఏ జట్టు వద్ద ఎంత పర్స్ మిగిలిందంటే..
DC – రూ. 47.25 కోట్లుPBKS – రూ. 47.75 కోట్లు
GT – రూ. 30.25 కోట్లు
LSG – రూ. 34.50 కోట్లు
RCB – రూ. 74.25 కోట్లు
KKR – రూ. 51 కోట్లు
RR – రూ. 41 కోట్లు
MI – రూ. 45 కోట్లు
SRH – రూ. 35 కోట్లు
CSK – రూ. 55 కోట్లు
-
ముగిసిన సెట్ 2
సెట్ 2 ముగిసింది. ఇందులో మొత్తం ఆరుగురు ప్లేయర్లను వేలం వేశారు. సెట్ 2లో చాహల్ అత్యధిక ధరను దక్కించుకున్నాడు.
మహ్మద్ షమీ – రూ. 10 కోట్లు (SRH)
డేవిడ్ మిల్లర్ – రూ. 7.50 కోట్లు (LSG)
యుజ్వేంద్ర చాహల్ – రూ. 18 కోట్లు (PBKS)
మహ్మద్ సిరాజ్ – రూ. 12.25 కోట్లు (GT)
లియామ్ లివింగ్‌స్టోన్ – రూ. 8.75 కోట్లు (RCB)
కేఎల్ రాహుల్ – రూ. 14 కోట్లు (DC)
-
-
ఢిల్లీ క్యాపిటల్స్ చేరిన కేఎల్ రాహుల్..
రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌ల తర్వాత కేఎల్ రాహుల్ కూడా అదే ధరను దక్కించుకుంటాడని అనుకున్నారు. కానీ, వేలంలో కేఎల్ రాహుల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు దక్కించుకుంది.
-
గుజరాత్ ఖాతాలో చేరిన హైదరాబాదీ పేసర్
సిరాజ్ మియా ఈ ఏడాది గుజరాత్ జట్టుతో ఆడనున్నాడు. హైదరాబాదీ పేసర్ కోసం రూ. 12.25 కోట్లు వెచ్చించింది. -
పంజాబ్ చేరిన చాహల్
యుజువేంద్ర చాహల్ ఈ ఏడాది వేలంలో రూ. 2 కోెట్ల ధరతో ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్ టీం రూ. 18 కోట్లకు దక్కించుకుంది. -
-
చాహల్ కోసం పోటీపడుతోన్న జట్లు..
యుజ్వేంద్ర చాహల్ కోసం లక్నో, పంజాబ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.
-
డేవిడ్ మిల్లర్‌ను దక్కించుకున్న లక్నో..
మాజీ గుజరాత్ జట్టు ఆటగాడు డేవిడ్ మిల్లర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 7.50 కోట్లతో దక్కించుకుంది. -
-
షమీని దక్కించుకున్న కావ్యాపాప
ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తన ఖాతాను తెరిచింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీని దక్కించుకుంది. రూ. 10 కోట్లు చెల్లించి తీసుకుంది. -
ముగిసిన మార్క్యూ సెట్ 1
ఇప్పటి వరకు జరిగిన మార్క్యూ సెట్ 1 ముగిసింది. ఎవరు ఏ ధరకు అమ్ముడయ్యారో ఓసారి చూద్దాం..అర్ష్‌దీప్ సింగ్ – రూ. 18 కోట్లు (PBKS)కగిసో రబడ – రూ. 10.75 కోట్లు (GT)
శ్రేయాస్ అయ్యర్ – రూ. 26.75 కోట్లు (PBKS)
జోస్ బట్లర్ – రూ. 15.75 కోట్లు (GT)
మిచెల్ స్టార్క్ – రూ. 11.75 కోట్లు (DC)
రిషబ్ పంత్ – రూ. 27 కోట్లు (LSG)
-
ఐపీఎల్ రికార్డులు బ్రేక్ చేసిన పంత్..
అందరూ అనుకున్నదే జరిగింది. రిషబ్ పంత్ రూ. 2 కోట్లతో ఈ ఏడాది వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, LSG, RCB పోరుతో మొదలైన ఈ యుద్దం చివరకు రూ. 27 కోట్లతో ముగిసింది. మధ్యలో SRH రూ. 19.50 కోట్లకు పెంచింది. అయితే, ఎల్‌ఎస్‌జీ 20.50 కోట్లకు పెంచడంతో పంత్‌ను దక్కించుకునేందుకు ఎంతలా పోరాడారో తెలుస్తోంది. ఎల్‌ఎస్‌జీ అత్యధికంగా రూ. 20.75 కోట్లకు బిడ్ చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ RTMని ఉపయోచింది. దీంతో LSG బిడ్‌ను రూ. 27 కోట్లకు పెంచి ఫైనల్ చేసుకుంది. -
ఢిల్లీ చేరిన మిచెల్ స్టార్క్
మిచెల్ స్టార్క్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 11.75 కోట్ల ధరతో దక్కించుకుంది. దీంతో గతేడాది అత్యధిక ప్రైజ్ పొందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఈ ఏడాది కేవలం సగం ధరనే దక్కించుకున్నాడు. -
గుజరాత్ చేరి జోస్ బట్లర్
మాజీ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ ఈ ఏడాది వేలంలో బేస్ ధర రూ. 2 కోట్లతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఆటగాడి కోసం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ హోరాహోరీగా బిడ్డింగ్ వేశాయి. చివరకు గుజరాత్ టైటాన్స్ జట్టు బట్లర్‌ను రూ. 15.75 కోట్లకు దక్కించుకుంది.
-
రూ. 26.75 కోట్లు దక్కించుకున్న శ్రేయాస్ అయ్యర్
అనుకున్నట్లుగా శ్రేయాస్ అయ్యార్ ఏకంగా ఐపీ్ల చరిత్రలోనే అత్యధిక ధరను దక్కించుకున్నాడు. పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. చివరిదాకా పోరాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ధరకు చేతులెత్తేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ఫిక్స్ అయ్యాడు.
-
శ్రేయాస్ అయ్యర్‌పై హోరాహోరీ పోరు
శ్రేయాస్ అయ్యర్ కోసం అన్ని జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. ప్రస్తుతం శ్రేయాస్ ధర రూ. 18 కోట్లకు చేరుకుంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోరాడుతున్నాయి.
-
గుజరాత్ జట్టులో చేరిన రబాడ
కగిసో రబాడను గుజరాత్ టైటాన్స్ రూ. 10.75 కోట్లకు దక్కించుకుంది. -
అర్షదీప్ సింగ్ @ రూ. 18 కోట్లు..
అర్షదీప్ సింగ్ ఏకంగా రూ. 18 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
-
తొలివేలం అర్షదీప్ సింగ్
తొలిరోజు తొలి బిడ్డింగ్ టీమిండియా ప్లేయర్ అర్షదీప్ సింగ్‌పై కొనసాగుతోంది.
-
మొదలైన మెగా వేలం..
-
IPL 2025 Mega Auction: తొలిరోజు 84 మంది ఆటగాళ్లపైనే బిడ్డింగ్..
మెగా వేలం మొదటి రోజు, నవంబర్ 24న 577 మంది ఆటగాళ్లలో కేవలం 84 మంది మాత్రమే వేలం వేయనున్నారు. మిగిలిన ఆటగాళ్లపై మరుసటి రోజు అంటే నవంబర్ 25న బిడ్డింగ్ జరగనుంది.
-
ఏ జట్టు వద్ద ఎంత డబ్బు ఉందంటే?
IPL మెగా వేలం 2025లో మొత్తం 10 జట్లు రూ.641 కోట్లు వెచ్చించవచ్చు. పంజాబ్ కింగ్స్ అత్యధికంగా రూ.110.5 కోట్లు, రాజస్థాన్ అత్యల్ప మొత్తం రూ.41 కోట్లు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది.
- పంజాబ్ కింగ్స్: 110.50 కోట్లు
- చెన్నై: 55 కోట్లు
- బెంగళూరు: 83 కోట్లు
- ఢిల్లీ: 73 కోట్లు
- గుజరాత్: 69 కోట్లు
- లక్నో: 69 కోట్లు
- కోల్‌కతా: 51 కోట్లు
- ముంబై: 45 కోట్లు
- హైదరాబాద్: 45 కోట్లు
- రాజస్థాన్: 41 కోట్లు
-
ఏ జట్టుకు ఎంతమంది ప్లేయర్లు కావాలంటే?
- చెన్నై – 20 మంది ఆటగాళ్లు, 7 విదేశీ ఆటగాళ్లు
- బెంగళూరు – 22 మంది ఆటగాళ్లు, 8 విదేశీ ఆటగాళ్లు
- హైదరాబాద్ – 20 మంది ఆటగాళ్లు, 5 విదేశీ ఆటగాళ్ళు
- ముంబై – 20 మంది ఆటగాళ్లు, 8 విదేశీ ఆటగాళ్లు
- ఢిల్లీ – 21 మంది ఆటగాళ్లు, 7 విదేశీ ఆటగాళ్లు
- రాజస్థాన్ – 19 మంది ఆటగాళ్లు, 7 విదేశీ ఆటగాళ్లు
- పంజాబ్ – 19 మంది ఆటగాళ్లు, 8 విదేశీ ఆటగాళ్లు
- కోల్‌కతా – 19 మంది ఆటగాళ్లు, 6 విదేశీ ఆటగాళ్లు
- గుజరాత్ – 20 మంది ఆటగాళ్లు, 7 విదేశీ ఆటగాళ్లు
- లక్నో – 20 మంది ఆటగాళ్లు, 7 విదేశీ ఆటగాళ్లు
-
2 రోజులు, 577 మంది ఆటగాళ్లు, 641 కోట్లు
ఐపీఎల్ 2025 మెగా వేలం మొత్తం 2 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ మెగా వేలంలో 204 స్థానాల కోసం 577 మంది ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలానికి కనీస బేస్ ధర 30 లక్షలు కాగా, గరిష్టంగా 2 కోట్లు ఉంది. 10 జట్లు చాలా మంది స్టార్ ఆటగాళ్లను విడుదల చేశాయి. అందువల్ల, ఈ ముఖ్యమైన ఆటగాళ్లను తమ జట్టులోకి తీసుకురావడానికి 10 జట్లు పోరాడవలసి ఉంటుంది.
IPL Auction 2025 Live Updates in Telugu: IPL 2025 మెగా వేలం ఈరోజు నవంబర్ 24 నుంచి ప్రారంభమవుతుంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో మొత్తం 2 రోజుల పాటు ఈ మెగా వేలం నిర్వహించనున్నారు. ఈ మెగా వేలంలో 577 మంది ఆటగాళ్లు పాల్గొంటారు. మొత్తం 10 జట్లు 204 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసుకునే వీలుంది. మెగా వేలంలో 204 మంది ఆటగాళ్లకు రూ.641 కోట్లు వెచ్చించనున్నారు. దీంతో 373 మంది ఆటగాళ్లకు నిరాశ తప్పదు. ఏ ఆటగాళ్ళపై కోట్ల వర్షం కురవనుంది, ఎవరు అన్ సోల్ట్ లిస్టులో చేరనున్నారో మరికొద్దిసేపట్లో తేలనుంది. అందరి దృష్టి ప్రస్తుతం పడనుంది. ఈ మెగా వేలానికి సంబంధించిన పూర్తి అప్‌డేట్‌లను లైవ్ బ్లాగ్ నుంచి తెలుసుకుందాం..
Published On - Nov 24,2024 2:43 PM