Ind vs Aus: ఆసీస్ కొంపముంచిన ఉస్మాన్ ఖవాజా.. ఆ క్యాచ్ పట్టుంటే కథ వేరే ఉండు..!

బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో ఓపెనర్లుగా రంగంలోకి దిగిన జైస్వాల్, కేఎల్ రాహుల్ 201 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో టీమిండియాకు శుభారంభం అందించారు. అయితే ఇంత గొప్ప ఆరంభానికి ఆసీస్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా క్యాచ్ పట్టకపోవడమే కారణం అని చెప్పవచ్చు.

Ind vs Aus: ఆసీస్ కొంపముంచిన ఉస్మాన్ ఖవాజా.. ఆ క్యాచ్ పట్టుంటే కథ వేరే ఉండు..!
Australia Player Usman Khawaja Dropped Yashasvi Jaiswal
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 24, 2024 | 2:08 PM

బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 150 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌటైంది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తుంది. ఓపెనర్లుగా రంగంలోకి దిగిన జైస్వాల్, కేఎల్ రాహుల్ 201 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో టీమిండియాకు శుభారంభం అందించారు. అయితే ఇంత గొప్ప ఆరంభానికి ఆసీస్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా క్యాచ్ పట్టకపోవడమే కారణం అని చెప్పవచ్చు.

టీమిండియా రెండో ఇన్నింగ్స్ 41వ ఓవర్ 5వ బంతికి జైస్వాల్ స్లిప్ లో క్యాచ్ ఇవ్వగా ఆ క్యాచ్ పట్టడంలో ఉస్మాన్ ఖవాజా విఫలమయ్యాడు. బంతి నేరుగా చేతికి వచ్చినా.. ఉస్మాన్ ఖవాజా అందుకోలేకపోయాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న యశస్వి జైస్వాల్ తన స్కోరును 161కి తీసుకెళ్లాడు.దీని ద్వారా టీమిండియా 350 మార్కును దాటగలిగింది. ఈ ఒక్క క్యాచ్ ఆస్ట్రేలియాకు ఖరీదైనది. ఆ క్యాచ్ పట్టుంటే పెర్త్ టెస్టు మ్యాచ్ ఫలితం వేరే ఉండేది.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ మరియు జోష్ హాజిల్‌వుడ్.

టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), కేఎల్ రాహుల్ , యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా మరియు మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి