Rishabh Pant: చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన రిషబ్ పంత్.. కాపాడిన వారికి ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

రిషబ్ పంత్ 2022లో కారు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని కారుకు కూడా మంటలు అంటుకున్నాయి. అయితే అతడిని ఇద్దరు వ్యక్తులు కాపాడారు. ఆ వ్యక్తులను పంత్ మర్చిపోలేదు. ప్రాణాలను కాపాడిన ఇద్దరికీ ప్రత్యేక బహుమతిని అందించాడు.

Rishabh Pant: చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన రిషబ్ పంత్.. కాపాడిన వారికి ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
Rishabh Pant
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 24, 2024 | 1:37 PM

టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ 2022లో కారు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని కారుకు కూడా మంటలు అంటుకున్నాయి. అయితే అతడిని ఇద్దరు వ్యక్తులు కాపాడారు. ఆ వ్యక్తులను పంత్ మర్చిపోలేదు. ప్రాణాలను కాపాడిన ఇద్దరికీ ప్రత్యేక బహుమతిని అందించాడు. రెండు స్కూటర్లను బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనూ దీనిపై చర్చ జరిగింది. ఆస్ట్రేలియా మీడియా రిషబ్ పంత్‌ను ప్రశంసించింది.

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఢిల్లీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. పంత్ కారు ప్రమాదానికి గురైన తర్వాత, ఇద్దరు వ్యక్తులు అతన్ని రక్షించారు. పంత్‌ను కారులో నుంచి తోసేశారు. అనంతరం రిషబ్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తన ప్రాణాలను కాపాడిన ఇద్దరికీ రిషబ్ స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీంతో పంత్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పంత్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు.  కారు ప్రమాదం తర్వాత పంత్ చాలా కాలం పాటు టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. దీనితో పాటు ఐపీఎల్ ఒక్క సీజన్ కూడా ఆడలేకపోయాడు. పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో ఉండేవాడు. కానీ ఇటీవలే ఢిల్లీ పంత్ రిటైన్ చేసుకోలేదు. పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ అయింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియాపై భారత్ 218 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు ఆలౌటైంది.

భారత్ ప్లేయింగ్ 11:  జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా

ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11:  ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి