AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027: ఐపీఎల్ @ 20.. హిస్టరీలోనే తొలిసారిగా.. ప్రపంచ లీగ్‌లే కుళ్లుకునేలా గ్రాండ్ ఓపెనింగ్..!

IPL 20th Edition: ఐపీఎల్ 2027, 20వ ఎడిషన్, రెండు దశాబ్దాల క్రికెట్ ప్రయాణాన్ని అత్యంత వైభవంగా జరుపుకోనుంది. బీసీసీఐ ప్రపంచవ్యాప్త ప్రారంభోత్సవం, దిగ్గజాల సన్మానం, దేశవ్యాప్త ట్రోఫీ పర్యటన, మరియు తమ శతాబ్ది ఉత్సవాలకు కౌంట్‌డౌన్‌తో కనీవినీ ఎరుగని వేడుకలను ప్లాన్ చేసింది. మార్చి 10 నుంచి మే 15 వరకు జరిగే ఈ టోర్నమెంట్ భారత క్రీడా చరిత్రలో ఒక అద్భుతమైన పండుగగా నిలవనుంది.

IPL 2027: ఐపీఎల్ @ 20.. హిస్టరీలోనే తొలిసారిగా.. ప్రపంచ లీగ్‌లే కుళ్లుకునేలా గ్రాండ్ ఓపెనింగ్..!
Ipl 20th Edition
Venkata Chari
|

Updated on: Sep 23, 2026 | 1:42 PM

Share

IPL 20th Edition: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన, అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), తన 20వ ఎడిషన్‌లోకి అడుగుపెడుతోంది. 2008లో కేవలం 8 జట్లతో ప్రారంభమైన ఐపీఎల్ రెండు దశాబ్దాల అద్భుతమైన చరిత్రను పూర్తి చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ ముఖ్యమైన మైలురాయిని కేవలం భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం వీక్షించేలా అత్యంత వైభవంగా జరుపుకోవడానికి బీసీసీఐ ఒక బృహత్తర ప్రణాళికను రూపొందించింది. దానికి అనుగుణంగానే, ఈ ఐపీఎల్ మరింత వైభవంగా జరగబోతోంది. ఇందుకోసమే బీసీసీఐ భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది.

ప్రపంచవ్యాప్త ప్రారంభోత్సవ వేడుక..!

లీగ్ 20 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బీసీసీఐ ఒక భారీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుక ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలే కాకుండా, అంతర్జాతీయ పాప్ గాయకులు, గత ఐపీఎల్ సీజన్ల దిగ్గజాలు కూడా హాజరుకానున్నారు. ఇది క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన, అత్యంత వైభవమైన ప్రారంభోత్సవంగా నిలవనుంది.

దిగ్గజాలు బరిలోకి..

2008లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ లీగ్‌కు వన్నె తెచ్చిన దిగ్గజ క్రికెటర్లందరినీ ఒకచోట చేర్చడమే ఈ ప్రణాళిక. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, షేన్ వార్న్ (స్మారక నివాళి), ఆడమ్ గిల్క్రిస్ట్ వంటి ఐపీఎల్ ఆల్-టైమ్ గ్రేట్ కెప్టెన్లు, దిగ్గజాలను సత్కరించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

శతాబ్ది ఉత్సవానికి నాంది..

బీసీసీఐ 2028లో తన 100వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. 2027లో జరిగే 20వ ఐపీఎల్ సీజన్‌ను, బీసీసీఐ తన ఘనమైన శతాబ్ది ఉత్సవాలకు అధికారిక కౌంట్‌డౌన్‌గా ఉపయోగించుకోనుంది. ఈ టోర్నమెంట్ అంతటా స్టేడియాలలో డిజిటల్ షోలు, లేజర్ లైట్ డిస్‌ప్లేల ద్వారా వంద సంవత్సరాల భారత క్రికెట్ ప్రస్థానాన్ని ఆవిష్కరించనున్నారు.

ట్రోఫీ పర్యటన..

20 ఏళ్ల విజయాలను పురస్కరించుకుని, ఒక ప్రఖ్యాత అంతర్జాతీయ సంగీత దర్శకుడు ప్రత్యేక గ్లోబల్ థీమ్ సాంగ్‌ను స్వరపరుస్తున్నారు. దీనితో పాటు, ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా, అధికారిక ట్రోఫీని ప్రజల వీక్షణార్థం భారతదేశంలోని 50కి పైగా ప్రధాన నగరాలకు ‘ట్రోఫీ టూర్’కు తీసుకెళ్లనున్నారు.

బిజీ షెడ్యూల్..!

వేసవి వేడి, రుతుపవన వర్షాల వల్ల ఆటగాళ్ల ప్రదర్శన ప్రభావితం కాకుండా నివారించడానికి బీసీసీఐ ఒక కొత్త ‘విండో’ను సిద్ధం చేసింది. ఈ టోర్నమెంట్ మొత్తం మార్చి 10న ప్రారంభమై మే 15తో ముగుస్తుంది. ఎప్పటిలాగే, కేవలం 65 రోజుల అతి తక్కువ వ్యవధిలో 10 జట్ల మధ్య మొత్తం 74 ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ఆడతారు. దీనివల్ల అభిమానులకు ప్రతిరోజూ వరుసగా ఉత్తేజకరమైన మ్యాచ్‌లు చూసే థ్రిల్ లభిస్తుంది.

మొత్తమ్మీద, ఐపీఎల్ 20వ ఎడిషన్ 2027 కేవలం మరో క్రికెట్ సీజన్ మాత్రమే కాదు, భారత క్రీడా చరిత్రలోనే అత్యంత వైభవమైన, అద్భుతమైన, కనువిందు చేసే పండుగ కానుంది. రెండు దశాబ్దాల ఉత్కంఠభరితమైన చరిత్ర, ప్రపంచ సాంకేతిక విప్లవం.. వీటన్నింటి కలయిక ఈ ఏడాది ఐపీఎల్‌ను ప్రపంచ క్రీడా ప్రపంచపు ముఖచిత్రాలపై స్వర్ణాక్షరాలతో లిఖించడం ఖాయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us