AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 TRP Crash : వ్యూవర్స్ లేరు.. యాడ్స్ లేవు.. పాతాళానికి టీఆర్పీ రేటింగ్స్.. ఏంటి క్రికెట్ క్రేజ్ తగ్గిందా?

IPL 2026 TRP Crash : వ్యూయర్స్‌తో పాటు ప్రకటనలు ఇచ్చే కంపెనీలు కూడా ఐపీఎల్‌పై పెడుతున్న ఖర్చును తగ్గించుకున్నాయి. అడ్వర్టైజర్ల సంఖ్య గతంతో పోలిస్తే 31 శాతం తగ్గింది. గతేడాది 65కు పైగా బ్రాండ్లు పోటీ పడగా, ఈసారి ఆ సంఖ్య 45 కు పడిపోయింది.

IPL 2026 TRP Crash : వ్యూవర్స్ లేరు.. యాడ్స్ లేవు.. పాతాళానికి టీఆర్పీ రేటింగ్స్.. ఏంటి క్రికెట్ క్రేజ్ తగ్గిందా?
Ipl Trophy
Rakesh
|

Updated on: May 04, 2026 | 1:50 PM

Share

IPL 2026 TRP Crash : క్రికెట్ ప్రేమికులకు పండగలాంటి ఐపీఎల్ 2026 సీజన్ ఆశించిన స్థాయిలో మెప్పించలేపోతుంది. అట్టహాసంగా మొదలైన ఈ టోర్నీ సగానికి పైగా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నా, టీఆర్పీ రేటింగ్స్‌లో మాత్రం దారుణంగా వెనకబడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈసారి వ్యూయర్‌షిప్ భారీగా పడిపోవడం క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, అడ్వర్టైజర్లు కూడా ఈ మెగా లీగ్‌కు మెల్లగా దూరమవుతుండటం బీసీసీఐకి, బ్రాడ్‌కాస్టర్లకు కంగారు పుట్టిస్తోంది.

BARC India, TAM Sports విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఐపీఎల్ 2026 టీఆర్పీ రేటింగ్స్‌లో ఏకంగా 18.8 శాతం తగ్గుదల నమోదైంది. గతంలో 4.57 పాయింట్లుగా ఉన్న రేటింగ్, ఇప్పుడు 3.71 కి పడిపోయింది. సగటు వ్యూయర్‌షిప్ విషయంలో 26 శాతం క్షీణత కనిపిస్తోంది. గతేడాది 12.40 కోట్ల మందికి చేరువైన ఈ టోర్నీ, ఈసారి కేవలం 11.36 కోట్ల మందికే పరిమితమైంది. ఇది ఐపీఎల్ బ్రాండ్ వాల్యూకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.

వ్యూయర్స్‌తో పాటు ప్రకటనలు ఇచ్చే కంపెనీలు కూడా ఐపీఎల్‌పై పెడుతున్న ఖర్చును తగ్గించుకున్నాయి. అడ్వర్టైజర్ల సంఖ్య గతంతో పోలిస్తే 31 శాతం తగ్గింది. గతేడాది 65కు పైగా బ్రాండ్లు పోటీ పడగా, ఈసారి ఆ సంఖ్య 45 కు పడిపోయింది. కేవలం 24 కొత్త బ్రాండ్లు మాత్రమే ఈ సీజన్‌లో అడుగుపెట్టాయి. మిగిలిన వారంతా పాత వారే. వ్యూయర్షిప్ తగ్గుతుండటంతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి యాడ్స్ ఇవ్వడానికి కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి.

ఎందుకు ఈ పరిస్థితి ?

ఐపీఎల్ పతనం వెనుక సోషల్ మీడియాలో అనేక కారణాలు వినిపిస్తున్నాయి:

సుదీర్ఘమైన ఫార్మాట్: టోర్నీ కాల పరిమితి పెరగడం వల్ల ప్రేక్షకులకు మొహం మొత్తుతోంది. రోజువారీ మ్యాచ్‌లు బోర్ కొట్టిస్తున్నాయని టాక్.

ఫ్లాట్ పిచ్‌లు: కేవలం బ్యాటర్లకే సహకరించే పిచ్‌లపై పరుగుల వరద పారుతోంది కానీ, బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఉండటం లేదు. దీంతో ఆటలో థ్రిల్ తగ్గిపోతోంది.

ఫాంటసీ యాప్స్‌పై నిషేధం: చాలా రాష్ట్రాల్లో ఫాంటసీ గేమింగ్ యాప్స్ నిషేధించడంతో, డబ్బులు పెట్టి బెట్టింగ్ వేసే యూత్ ఆసక్తి తగ్గింది.

ఆడియన్స్ అలవాట్లు: ఇప్పుడు ప్రేక్షకులు కేవలం తమ ఫేవరెట్ టీమ్స్ ఆడే మ్యాచ్‌లను మాత్రమే చూస్తున్నారు తప్ప, మిగతా మ్యాచ్‌లను పట్టించుకోవడం లేదు.

ఏది ఏమైనా, ఐపీఎల్ పట్ల ప్రజల్లో ఉన్న పిచ్చి కొంచెం కొంచెం తగ్గుతోందని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. క్రికెట్ బోర్డు, బ్రాడ్‌కాస్టర్లు ఆటలో కొత్తదనం తీసుకురాకపోతే, భవిష్యత్తులో ఈ పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం ఉంది. కేవలం రన్ల కోసమే కాకుండా, ఉత్కంఠభరితమైన పోరుల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ జుట్టు రకాన్ని బట్టి వారానికి ఎన్ని సార్లు చేయాలో తెలుసుకోండి
మీ జుట్టు రకాన్ని బట్టి వారానికి ఎన్ని సార్లు చేయాలో తెలుసుకోండి
పాత ఫోన్ విక్రయిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
పాత ఫోన్ విక్రయిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
అర్ధరాత్రి థ్రిల్ కోసం స్పీడ్ రైడ్.. తెల్లారేసరికి బ్రేకింగ్ NEWS
అర్ధరాత్రి థ్రిల్ కోసం స్పీడ్ రైడ్.. తెల్లారేసరికి బ్రేకింగ్ NEWS
భర్త మరణిస్తే భార్య భరణం పొందవచ్చా..?
భర్త మరణిస్తే భార్య భరణం పొందవచ్చా..?
ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
కాశీ-అయోధ్య యాత్రకు ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్.. 9 రోజుల్లో 5 పవిత్ర
కాశీ-అయోధ్య యాత్రకు ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్.. 9 రోజుల్లో 5 పవిత్ర
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు! వారం రోజులు వానల్లేవ్
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు! వారం రోజులు వానల్లేవ్
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..