AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Points Table : పంజాబ్ టాప్.. కేకేఆర్‌కు జాక్‌పాట్.. వరుణుడి ఎంట్రీతో మారిపోయిన ఐపీఎల్ పాయింట్స్ టేబుల్

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026లో కోల్‌కతా వర్సెస్ పంజాబ్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరగా, కేకేఆర్ ఎట్టకేలకు తన పాయింట్ల ఖాతాను తెరిచింది. పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్‌ల్లో 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

IPL 2026 Points Table : పంజాబ్ టాప్.. కేకేఆర్‌కు జాక్‌పాట్.. వరుణుడి ఎంట్రీతో మారిపోయిన ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
Cameron Green Ipl Pti
Rakesh
|

Updated on: Apr 07, 2026 | 7:13 AM

Share

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుసగా 11 మ్యాచ్‌లు ఎంతో జోరుగా సాగినా, 12వ మ్యాచ్‌కు మాత్రం వరుణుడు అడ్డుపడ్డాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సోమవారం (ఏప్రిల్ 6) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరగాల్సిన పోరు వర్షం వల్ల రద్దయింది. మ్యాచ్ కనీసం సగం కూడా పూర్తి కాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, ఈ ఫలితం పాయింట్ల పట్టికలో అనూహ్య మార్పులకు దారితీసింది. పంజాబ్ కింగ్స్ నంబర్-1 స్థానానికి చేరుకున్నప్పటికీ, వారికి ఒక రకమైన లోటు మిగిలిపోయింది.

కోల్‌కతాలో మ్యాచ్ మొదలైనప్పటి నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది. అసలు ఒక్క బంతి అయినా పడుతుందా అని అందరూ అనుమానపడ్డారు. కానీ మ్యాచ్ మొదలై అభిమానులకు కాస్త ఆశ కలిగించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో కేవలం 3.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. అప్పటికి కేకేఆర్ 25 పరుగులు చేసి రెండు కీలక వికెట్లు కోల్పోయింది. సరిగ్గా అదే సమయంలో వర్షం దంచికొట్టడంతో ఆట నిలిచిపోయింది. సుమారు మూడు గంటల పాటు అంపైర్లు వేచి చూసినా వాన తగ్గకపోవడంతో రాత్రి 11 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం మ్యాచ్ రద్దయితే రెండు టీమ్‌లకు తలో పాయింట్ ఇస్తారు. ఈ ఒక్క పాయింట్‌తో పంజాబ్ కింగ్స్ మొత్తం 5 పాయింట్లతో టేబుల్ అగ్రస్థానానికి చేరుకుంది. అప్పటివరకు 4 పాయింట్లతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వెనక్కి నెట్టి పంజాబ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే, పంజాబ్ అభిమానులకు ఇది పూర్తి సంతోషాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే మ్యాచ్ నిలిచిపోయే సమయానికి పంజాబ్ పూర్తి ఆధిపత్యంలో ఉంది. కేవలం 16 పరుగులకే కోల్‌కతా రెండు వికెట్లు తీసి గెలుపు దిశగా సాగుతున్న పంజాబ్‌కు వర్షం వల్ల ఒక పాయింట్ నష్టం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అజింక్య రహానే సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఈ వర్షం ఒక రకంగా వరం అనే చెప్పాలి. అంతకుముందు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పాయింట్ల ఖాతా తెరవని కేకేఆర్‌కు, ఈ మ్యాచ్‌లో కూడా ఆరంభం అంతా బాగోలేదు. క్రీజులో బ్యాటర్లు తడబడుతున్న వేళ వర్షం పడటం వల్ల వారికి ఉచితంగా ఒక పాయింట్ లభించింది. ఈ 1 పాయింట్‌తో కేకేఆర్ పాయింట్ల పట్టికలో 9వ స్థానం నుంచి 8వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం పాయింట్లు లేని జట్లుగా గుజరాత్ టైటాన్స్ (9వ స్థానం), చెన్నై సూపర్ కింగ్స్ (10వ స్థానం) మాత్రమే మిగిలాయి.

లేటెస్ట్ పాయింట్స్ టేబుల్ (టాప్ 5 జట్లు)

ప్రస్తుత పాయింట్ల పట్టికను గమనిస్తే.. పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్‌ల్లో 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 పాయింట్లతో రెండో స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. వర్షం కారణంగా రద్దయిన ఈ మ్యాచ్ కేవలం పాయింట్లనే కాదు, జట్ల నెట్ రన్ రేట్‌పై కూడా ప్రభావం చూపనుంది. రాబోయే మ్యాచ్‌ల్లో కేకేఆర్ తన ఆట తీరును మెరుగుపరుచుకోకపోతే ప్లే ఆఫ్ రేసులో వెనుకబడే ప్రమాదం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us