AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా అసలైన సినిమా అంటే.. ఇక ప్లేఆఫ్స్ డిసైడ్ చేసేది ఆ రెండు జట్లే..

ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి కొన్ని జట్లు తప్పుకోగా, మరికొన్ని జట్లు టాప్ ఫోర్ కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. తాజా సమీకరణాలు ఇక్కడ ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సరి లుక్కేయండి.

ఇది కదా అసలైన సినిమా అంటే.. ఇక ప్లేఆఫ్స్ డిసైడ్ చేసేది ఆ రెండు జట్లే..
Ipl 2026
Ravi Kiran
|

Updated on: May 11, 2026 | 1:21 PM

Share

ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు ‘డూ ఆర్ డై’ స్టేజ్‌కి వచ్చేసింది. మే 10వ తేదీన జరిగిన కీలక మ్యాచ్‌ల తర్వాత ప్లే ఆఫ్స్ రేసులో పెను మార్పులు సంభవించాయి. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుండి అధికారికంగా తప్పుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో చివరి బంతికి ఓడిపోయిన ముంబై, అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమితో లక్నో ఆశలు కూడా ఆవిరయ్యాయి. దీంతో 10 జట్ల మధ్య సాగిన ఈ పోటీ ఇప్పుడు 8 జట్ల మధ్య పోరుగా మారింది.

ప్రస్తుత పాయింట్ల పట్టికను గమనిస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), గుజరాత్ టైటాన్స్ చెరో 14 పాయింట్లతో టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు జట్లు తలో 11 మ్యాచ్‌లు ఆడగా, ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకోవాలంటే ఈ జట్లు మిగిలిన మ్యాచ్‌ల్లో కనీసం ఒకటి గెలిస్తే సరిపోతుంది. ఇక నాలుగో స్థానంలో 13 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ ఉంది. పంజాబ్ మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిని గెలిస్తే సులభంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.

మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ చెరో 12 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో ఉండి పోరాడుతున్నాయి. ఈ జట్లు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండింటిలో గెలిచి 16 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. అయితే, ఇది కేవలం వారి విజయాలపైనే కాకుండా టాప్ ఫోర్‌లో ఉన్న జట్ల ఓటములపై కూడా ఆధారపడి ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. వారు తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలవడంతో పాటు మిగతా జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాలి. ముంబై, లక్నోలు రేసులో లేకపోయినా, ఇతర జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసే ‘స్పాయిలర్స్’గా మారే అవకాశం ఉంది. రాబోయే ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్ లాంటిదే!

Follow Us