AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ఈ సీజన్‌లో డేంజరస్ ఓపెనింగ్ జోడీ ఇదే.. లిస్ట్ చూస్తే ప్రత్యర్థులకు వణుకే..!

IPL 2026 Opening Partnerships: ఐపీఎల్ 2026 జోరుగా దూసుకెళ్తోంది. అయితే, బౌలర్లే కాదు, బ్యాటర్లు కూడా బౌండరీలు బాదేస్తూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అత్యంత డేజంరస్ జోడీగా పేరుగాంచింది ఓవరో ఓ చూద్దాం. ఈ లిస్ట్ లో తోపు జట్లు దారుణంగా విఫలమవ్వగా, తొలి ట్రోపీ సాధించిన టీం అగ్ర స్థానంలో దూసుకెళ్తోంది.

IPL 2026: ఈ సీజన్‌లో డేంజరస్ ఓపెనింగ్ జోడీ ఇదే.. లిస్ట్ చూస్తే ప్రత్యర్థులకు వణుకే..!
Ipl 2026 Opening Partnerships
Venkata Chari
|

Updated on: Apr 08, 2026 | 8:20 PM

Share

IPL 2026 Opening Partnerships: ఐపీఎల్ పదహారో సీజన్‌లో బ్యాటర్ల దూకుడు కొనసాగుతోంది. ముఖ్యంగా తొలి ఆరు ఓవర్లలో ఓపెనింగ్ జోడీలు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ స్కోర్లకు పునాది వేస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు పరుగుల వరద పారిస్తూ అగ్రస్థానంలో నిలవగా, మరికొన్ని జట్లు ఆశించిన స్థాయిలో రాణించలేక సతమతమవుతున్నాయి. ఆయా జట్ల ఓపెనింగ్ ప్రదర్శనలను ఓసారి చూద్దాం..

రాజస్థాన్ రాయల్స్ ఆధిపత్యం..

ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ జోడీ అత్యంత నిలకడైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ జోడీ కేవలం మూడు ఇన్నింగ్స్‌ల్లోనే ఏకంగా 225 పరుగులు జోడించి అందరికంటే ముందున్నారు. వీరిద్దరూ మైదానంలోకి అడుగుపెట్టారంటే చాలు బౌండరీల వర్షం కురుస్తోంది. దూకుడుగా ఆడటంతో పాటు ఇన్నింగ్స్‌ను నిర్మించడంలో వీరిద్దరి మధ్య ఉన్న సమన్వయం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

రెండోస్థానంలో ముంబై ఇండియన్స్

మరోవైపు ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వీరు మూడు ఇన్నింగ్స్‌ల్లో 176 పరుగులు సాధించి రెండో స్థానంలో నిలిచారు. కోల్‌కతా నైట్ రైడర్స్ జోడీ మూడు ఇన్నింగ్స్‌ల్లో 111 పరుగులు చేయగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మూడు ఇన్నింగ్స్‌ల్లో 101 పరుగులు జోడించారు. హైదరాబాద్ బ్యాటర్లు వేగంగా ఆడుతున్నప్పటికీ, భారీ భాగస్వామ్యాలను నెలకొల్పడంలో స్వల్పంగా వెనుకబడ్డారు.

నిరాశ పరుస్తున్న రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్..

అగ్రశ్రేణి జట్లుగా పేరున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ విషయంలో ఒకింత ఇబ్బంది పడుతున్నాయి. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 46 పరుగులు మాత్రమే చేయగలిగారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 37 పరుగులు మాత్రమే నమోదు చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో వారు కేవలం 2 పరుగులు మాత్రమే ఓపెనింగ్ భాగస్వామ్యంగా జోడించారు.

టీ20 క్రికెట్‌లో ఓపెనర్ల ఆరంభం జట్టు గెలుపోటములను శాసిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు తమ ఓపెనర్ల అద్భుత ఫామ్ వల్ల లాభపడుతుంటే, ఢిల్లీ, చెన్నై వంటి జట్లు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. టోర్నీ ముందుకు సాగుతున్న కొద్దీ ఈ గణాంకాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం రాజస్థాన్ జోడీనే టోర్నీలో అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీగా కొనసాగుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us