AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Records : అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఆ ఒక్కడికే దక్కిన గౌరవం

IPL Records : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో తన జట్టు ఓడిపోయినప్పటికీ, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఏకైక ఆటగాడు అనిల్ కుంబ్లే మాత్రమే. అప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌ గా అనిల్ కుంబ్లే ఉన్నారు.

IPL Records : అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఆ ఒక్కడికే దక్కిన గౌరవం
Anil Kumble
Rakesh
|

Updated on: Mar 24, 2026 | 6:44 PM

Share

IPL Records : ఐపీఎల్ 2026 (IPL 2026) సందడి మొదలైపోయింది. మార్చి 28 నుంచి మైదానంలో పరుగుల జాతర షురూ కానుంది. ఈ తరుణంలో ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయిన కొన్ని ఆసక్తికరమైన రికార్డులు మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరు మీద ఉన్న ఒక వింతైన రికార్డు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో తన జట్టు ఓడిపోయినప్పటికీ, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఏకైక ఆటగాడు అనిల్ కుంబ్లే మాత్రమే. ఆ రికార్డు వెనుక ఉన్న ఆసక్తికర కథేంటో తెలుసుకుందాం.

అనిల్ కుంబ్లే సృష్టించిన ఆ వింత రికార్డు ఏంటి?

2009 ఐపీఎల్ ఫైనల్ సౌతాఫ్రికా వేదికగా జరిగింది. అప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గా అనిల్ కుంబ్లే ఉన్నారు. ఫైనల్ పోరులో ఆర్సీబీ జట్టు డెక్కన్ చార్జర్స్ (హైదరాబాద్ టీమ్)తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కేవలం 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. సాధారణంగా విజేత జట్టులోని ఆటగాడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇస్తారు. కానీ, ఆ మ్యాచ్‌లో కుంబ్లే ప్రదర్శన ఎంత అద్భుతంగా ఉందంటే.. ఓడిపోయిన జట్టులో ఉన్నప్పటికీ ఆయనకే ఆ అవార్డు దక్కింది. ఐపీఎల్ 19 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటి, చివరిసారి.

ఆ మ్యాచ్‌లో అసలేం జరిగింది?

మొదట బ్యాటింగ్ చేసిన డెక్కన్ చార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. కుంబ్లే తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని వణికించారు. కేవలం 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టారు. అందులో అప్పటి డెక్కన్ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను డకౌట్ చేయడం ఒక హైలైట్. అలాగే ఆండ్రూ సైమండ్స్, రోహిత్ శర్మ, వేణుగోపాల రావు వికెట్లు తీసి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. కానీ దురదృష్టవశాత్తు, ఆర్సీబీ బ్యాటర్లు 144 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయారు.

దిగ్గజ బ్యాటర్లు ఉన్నా దక్కని విజయం

ఆ సమయంలో ఆర్సీబీ జట్టులో జాక్ కలిస్, రాహుల్ ద్రవిడ్, రాస్ టేలర్, మార్క్ బౌచర్ వంటి దిగ్గజాలతో పాటు యువ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. అయినప్పటికీ డెక్కన్ చార్జర్స్ బౌలర్లు ప్రజ్ఞాన్ ఓజా (3 వికెట్లు), సైమండ్స్ (2 వికెట్లు) ధాటికి ఆర్సీబీ తలవంచింది. కేవలం 6 పరుగుల తేడాతో కప్పు చేజారింది. అనిల్ కుంబ్లే తన కెరీర్‌లో క్రీడాకారుడిగా ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ లేదా ప్రపంచకప్ గెలవలేకపోయారు. కానీ, అన్ని మెగా టోర్నీల్లోనూ ఆయన అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.

వరల్డ్ కప్ లోనూ కుంబ్లే జంబో రికార్డులే

ఐపీఎల్‌లోనే కాదు, వన్డే ప్రపంచకప్‌లోనూ అనిల్ కుంబ్లే గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఐపీఎల్ లో ఆయన మొత్తం 45 వికెట్లు తీయగా, ఆయన ఎకానమీ రేటు కేవలం 6.5 మాత్రమే. ఇక వరల్డ్ కప్ విషయానికి వస్తే.. 18 మ్యాచుల్లో 31 వికెట్లు తీశారు. వన్డేల్లో ఓవర్ కు 4 పరుగులు మాత్రమే ఇచ్చే అత్యంత పొదుపైన బౌలర్‌గా ఆయనకు పేరుంది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు కుంబ్లే చేసిన ఈ పాత రికార్డులను గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ ఆయనకు నీరాజనాలు పలుకుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us