AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ఐపీఎల్‌ హిస్టరీలో తొలిసారి.. తండ్రీకొడుకుల మధ్య మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?

IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌ ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఓ స్పెషల్ మ్యాచ్ పై అందరి ఫోకస్ నిలిచింది. అదేంటంటే తండ్రీకొడుకుల జట్ల మధ్య పోరు. ఈ మ్యాచ్ ఎప్పుడు, ఏ రోజు, ఎక్కడ జరగనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

IPL 2026: ఐపీఎల్‌ హిస్టరీలో తొలిసారి.. తండ్రీకొడుకుల మధ్య మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Ipl 2026
Venkata Chari
|

Updated on: Mar 31, 2026 | 6:33 PM

Share

Sachin Tendulkar vs Arjun Tendulkar: ఐపీఎల్ చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ ఘట్టాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఈ సీజన్‌లో జరగబోయే ఓ మాత్రం భారత టీ20 లీగ్ చరిత్రలో మునుపెన్నడూ చూడనిది. ఐపీఎల్‌లో తొలిసారిగా తండ్రీకొడుకుల జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ 2026 మార్చి 28న ప్రారంభం కానుంది. లీగ్ 19వ సీజన్‌లోని మొదటి భాగం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ క్రమంలో అసలు తండ్రీకొడుకుల జట్లు ఎప్పుడు తలపడతాయి? ఐపీఎల్‌లో ఆ చారిత్రాత్మక మ్యాచ్‌ను మనం ఎప్పుడు చూడబోతున్నాం? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్‌లో తొలిసారిగా సచిన్, అర్జున్ జట్ల మధ్య పోరు..

ముందుగా, ఆ తండ్రీకొడుకులు ఎవరో తెలుసుకుందాం. మనం మాట్లాడుకుంటున్నది సచిన్ టెండూల్కర్, అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ గురించి. ఐపీఎల్ 2025 వరకు, వీరిద్దరూ ముంబై ఇండియన్స్ జట్టుతో అనుబంధం కలిగి ఉన్నారు. అయితే, ఐపీఎల్ 2026లో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ఈసారి, ఐపీఎల్ 2026 వేలంలో ఎల్‌ఎస్‌జీ (LSG) టీం అర్జున్ టెండూల్కర్ ను దక్కించుకుంది. దీంతో ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో అర్జున్ భాగమయ్యాడు. మరోవైపు, సచిన్ టెండూల్కర్ మునుపటిలాగే ముంబై ఇండియన్స్‌తో అనుబంధం కొనసాగిస్తున్నాడు.

తండ్రీకొడుకుల జట్టు ఏ రోజున పోటీపడుతుంది..?

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ బరిలోకి దిగగానే సచిన్, అర్జున్ ఒకరినొకరు ఢీ కొట్టనున్నారు. అయితే ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఐపీఎల్ 2026లో మే 4వ తేదీన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తొలిసారిగా తలపడనున్నాయి. అదే రోజు, ఐపీఎల్‌లో తండ్రీకొడుకులు కూడా తొలిసారిగా ఒకరినొకరు ఎదుర్కోనున్నారు. ఈ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగనుంది.

సచిన్ ముంబైకి మెంటార్ కాగా, అర్జున్ లక్నో ప్లేయర్ గా..

సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్‌గా ఉన్నారు. ఆయన జట్టుకు సలహాలు ఇస్తూ, దాని లోపాలను ఎత్తిచూపి, వాటిని సరిదిద్దే మార్గాలను సూచిస్తారు. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎల్‌ఎస్‌జీ జట్టులో ఆటగాడు. అతను లక్నో జట్టులో ఒక ఆల్‌రౌండర్. మే 4వ తేదీన లక్నో జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడినప్పుడు, ఎల్‌ఎస్‌జీ తుది జట్టులో అర్జున్ టెండూల్కర్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.

లక్నోతో అరంగేట్రం మ్యాచ్ ఆడేనా..

లక్నో తరపున అర్జున్ టెండూల్కర్‌కు ఇది తొలి సీజన్ కానుంది. అతను గతంలో 2023లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అతను ముంబై తరపున ఐదు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి, మూడు వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IPS అధికారి సస్పెన్షన్ తర్వాత మళ్లీ Job వస్తుందా?
IPS అధికారి సస్పెన్షన్ తర్వాత మళ్లీ Job వస్తుందా?
శ్రీలంక విమానమెక్కిన టీమిండియా.. కానీ ఆ కీలక ప్లేయర్ మిస్సింగ్
శ్రీలంక విమానమెక్కిన టీమిండియా.. కానీ ఆ కీలక ప్లేయర్ మిస్సింగ్
భారత సైన్యంలోకి అత్యాధునిక 'శత్రుంజయ్' యాంటీ డ్రోన్ సిస్టమ్
భారత సైన్యంలోకి అత్యాధునిక 'శత్రుంజయ్' యాంటీ డ్రోన్ సిస్టమ్
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి
అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ
శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే
శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!