Video: భార్యతో కలిసి ఆ స్వామి వద్దకు విరాట్ కోహ్లీ! రెండో IPL కప్పు గెలిచినందుకు..
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండోసారి కప్పు గెలిచిన తర్వాత, విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. బిజీ షెడ్యూల్‌లోనూ ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం కోహ్లీ పదేపదే స్వామిని కలుస్తారు. 'రాధే రాధే' అంటూ జపిస్తూ ఆయన దర్శనం చేసుకున్నారు.

దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ రెండో సారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచాక తొలిసారి బయటికి వచ్చాడు. తన భార్య అనుష్క శర్మతో కలిసి ప్రేమానంద్ మహరాజ్‌ను దర్శించుకున్నాడు. గతంలో కూడా విరాట్ పలుమార్లు అనుష్కతో కలిసి ఈ స్వామి ఆశ్రమానికి వెళ్లిన విషయం తెలిసిందే. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా.. కాస్త ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతన అవసరం ఉంటుంది. కోహ్లీ కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. నిత్యం క్రికెట్‌తో బిజీగా ఉంటున్నా.. సమయం కుదిరినప్పుడల్లా కూడా ప్రేమానంద్ మహరాజ్ వద్దకు వెళ్తున్నాడు. స్వామి వద్దకు వెళ్తున్న క్రమంలో విరాట్ ‘రాధే.. రాధే..’ అంటూ జపం చేస్తూ వెళ్లడం విశేషం.
Virat Kohli and Anushka Sharma at the Premanand Ji Maharaj’s Ashram. 🙏
– Virat chanting ‘Radhe, Radhe’. ❤️ pic.twitter.com/e35WJ9Ze5F
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 2, 2026
కాగా ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. 2025లో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలి టైటిల్‌ను ముద్దాడిన ఆర్సీబీ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. ఎటాకింగ్ ఛాంపియన్స్‌లా ఆడుతూ వరుసగా రెండో కప్పు కూడా గెలుచుకుంది. ఈ సీజన్ లీగ్ మ్యాచ్‌లలో ఆర్సీబీనే నంబర్ ప్లేస్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్వాలిఫైయర్ 1, ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసి కప్పు కొట్టింది. అటు టీమ్‌తో పాటు కోహ్లీ సైతం అద్భుతంగా రాణించాడు. మొత్తం ఈ సీజన్లో 675 పరుగులు చేసి ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసి బ్యాటర్‌గా నిలిచాడు. రెండుసారి కప్పు గెలిచిన సంతోషాన్ని ప్రేమానంద్ మహరాజ్ జీతో పంచుకుంటూ ఆయన ఆశీస్సులు తీసుకునేందుకే సతీసమేతంగా స్వామి ఆశ్రమానికి వెళ్లినట్లు ఉన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
