IPL 2026 : ఐపీఎల్ వేలంలో వయసులో చిన్నోడు, పెద్దోడు ఎవరో తెలుసా ? వీళ్ల బేస్ ప్రైస్ వింటే షాకే
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ (ఐపీఎల్ 2026) కోసం మినీ ఆక్షన్ డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలలో ఉన్న 77 ఖాళీ స్లాట్‌లను భర్తీ చేయడానికి ఈ వేలంలో ఆటగాళ్ల పై గట్టి పోటీ నడవనుంది.

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ (ఐపీఎల్ 2026) కోసం మినీ ఆక్షన్ డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలలో ఉన్న 77 ఖాళీ స్లాట్‌లను భర్తీ చేయడానికి ఈ వేలంలో ఆటగాళ్ల పై గట్టి పోటీ నడవనుంది. బీసీసీఐ ఇప్పటికే షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడైన, అత్యంత ఎక్కువ వయసున్న ఆటగాడు ఎవరో, వారి వయసు, బేస్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకుందాం.
అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు
ఐపీఎల్ 2026 ఆక్షన్‌లో అత్యంత తక్కువ వయసు ఉన్న ఆటగాడు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వహిదుల్లా జాద్రాన్. నవంబర్ 15, 2007 న జన్మించిన వహిదుల్లా వయసు వేలం రోజు నాటికి 18 సంవత్సరాల 31 రోజులు అవుతుంది. ఇతను అన్‌క్యాప్డ్ బౌలర్, అతని బేస్ ప్రైస్ రూ.30 లక్షలు. వేలంలో ఉన్న ఆటగాళ్లలో 2008 లేదా ఆ తర్వాత జన్మించిన వారు ఎవరూ లేరు. వహిదుల్లా 19 టీ20 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ 6.72 గా ఉంది. అయితే, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న వైభవ్ సూర్యవంశీ. గత ఏడాది ఆక్షన్‌లో రూ.30 లక్షల బేస్ ప్రైస్ ఉన్న అతన్ని రాజస్థాన్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది.
అత్యంత ఎక్కువ వయసున్న ఆటగాడు
ఐపీఎల్ 2026 ఆక్షన్‌లో అత్యంత ఎక్కువ వయసున్న ఆటగాడు ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా. అతను మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడతాడు. జలజ్ సక్సేనా వేలానికి ఒక రోజు ముందు, డిసెంబర్ 15, 1986 న ఇండోర్‌లో జన్మించాడు. ఆక్షన్ రోజు నాటికి అతను తన 39వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. అతను కూడా అన్‌క్యాప్డ్ ఆటగాడే అతని బేస్ ప్రైస్ రూ.40 లక్షలుగా ఉంది. 1986 లేదా ఆ ముందు జన్మించిన ఆటగాళ్లు ఎవరూ ఈ వేలంలో లేరు. జలజ్ సక్సేనా ఐపీఎల్‌లో 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేశాడు. అదే అతని చివరి మ్యాచ్ కూడా. ఆ మ్యాచ్‌లో అతను 3 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




