IPL Mock Auction : వేలంలో ఊహించని ట్విస్ట్..ఆస్ట్రేలియా ప్లేయర్‌ను రూ.21 కోట్ల రికార్డు ధరకు కొన్న చెన్నై
IPL Mock Auction : ఐపీఎల్ 2026 కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న నేపథ్యంలో భారత మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో నిర్వహించిన ఒక మాక్ ఆక్షన్ క్రీడాభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

IPL Mock Auction : ఐపీఎల్ 2026 కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న నేపథ్యంలో భారత మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో నిర్వహించిన ఒక మాక్ ఆక్షన్ క్రీడాభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఈ వేలంలో మొత్తం 359 మంది ఆటగాళ్ల భవితవ్యాన్ని అంచనా వేశారు. ఈ మాక్ ఆక్షన్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కేమరూన్ గ్రీన్ అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
అశ్విన్ మాక్ ఆక్షన్ ప్రకారం.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కేమరూన్ గ్రీన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఏకంగా రూ.21 కోట్లకు కొనుగోలు చేసింది. గ్రీన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా తీవ్రంగా పోటీపడింది. గ్రీన్ తర్వాత ఇంగ్లాండ్‌కు చెందిన స్పిన్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. గత సీజన్‌లో RCB తరఫున ఆడిన లివింగ్‌స్టోన్‌ను KKR భారీగా రూ.18.5 కోట్లకు దక్కించుకుంది.
ఈ వేలంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది. KKR జట్టు ఓపెనర్ పృథ్వీ షా కోసం కూడా రూ.5.25 కోట్లు ఖర్చు చేసింది. వీరితో పాటు, జానీ బెయిర్‌స్టో (రూ.3.75 కోట్లు), బెన్ డకెట్ (రూ.4 కోట్లు) కూడా KKR జట్టులోకి చేరారు. ఈ మాక్ ఆక్షన్‌లో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ రూ.10.5 కోట్లు పలికి, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులోకి వెళ్లాడు.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (LSG) రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. శ్రీలంక యువ పేసర్ మతీష పతిరానాను ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రూ.7 కోట్లకు తమ జట్టులో చేర్చుకుంది. డేవిడ్ మిల్లర్ రూ.4.5 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కు, రచీన్ రవీంద్ర రూ.2.25 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కు దక్కారు. లక్నో సూపర్ జెయింట్స్ వానిందు హసరంగాను రూ.2 కోట్లకు దక్కించుకోగా, ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ.3.5 కోట్లకు కొనుగోలు చేసింది. మరోవైపు, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, అతని స్వదేశీ ఆటగాడు జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ ఈ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో ఉండటం గమనార్హం. చెన్నై సూపర్ కింగ్స్ తరపున జోష్ ఇంగ్లిస్ రూ.2 కోట్లకు, ఆకాష్ దీప్ రూ.3.25 కోట్లకు కొనుగోలు చేయబడ్డారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




