IPL 2025: ఐపీఎల్ రీస్టార్ట్.. ఆ స్టార్ ప్లేయర్లు దూరం.. దెబ్బకు RCB దుకాణం సర్దుకోవాల్సిందే.!
ఐపీఎల్ సీజన్ రీస్టార్ట్ అవుతుండటంతో అభిమానులు ఆనందంగా ఉన్నా.. స్వదేశాలకు వెళ్లిపోయిన ఫారిన్ ప్లేయర్లు తిరిగి వస్తారా? లేదా? అనే విషయం ఉత్కంఠ రేపుతోంది. మరి ఆటగాళ్లను రప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు ఫలిస్తాయా? అసలు ఆటకు దూరమయ్యే విదేశీ ఆటగాళ్లు ఎవరు?

ఈనెల 17నుంచి మళ్లీ ఐపీఎల్ మ్యాచ్‌లు రీస్టార్ట్ చేయాలని నిర్ణయించిన బీసీసీఐ.. విదేశీ ఆటగాళ్లను తిరిగి రప్పించడం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆటగాళ్లను భారత్‌కు పంపేలా విదేశీ బోర్డులపై ఒత్తిడి పెంచుతోంది. ఐపీఎల్ సీఈఓ హేమాంగ్ స్వయంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులతో నేరుగా మాట్లాడుతున్నారు. పలు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లతో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతున్నాయి. అయితే, వెళ్లిన వారు వచ్చే పరిస్థితుల్లో లేరు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ,దక్షిణాఫ్రికా ఆటగాళ్లే ఎక్కువమంది ఉన్నారు.
మొదట ఆస్ట్రేలియన్ ప్లేయర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్ ఇండియాకు రాలేరన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు బీసీసీఐకి షాక్ ఇవ్వనున్నారు. ఇండియా పాక్ ఉద్రిక్తలతో ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు మే 9న ప్రకటించడంతోనే దాదాపు అందరు విదేశీ ఆటగాళ్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దాంతో ఫ్రాంచైజీలు తమ జట్లలోని కీలక ఆటగాళ్లను రప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

యుద్ధం కారణంగా టోర్నీ వాయిదా పడకుండా ఉంటే మే 25న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ ముగియాల్సి ఉంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 3 వరకు టోర్నీ పొడిగించాల్సి వచ్చింది. అయితే విదేశీ ఆటగాళ్లందరూ మే 25 ప్రకారమే సిద్ధమై లీగ్ కోసం తమ ప్రణాళికలకు రూపొందించుకున్నారు. ఆ తేదీ తర్వాత ఆయా జాతీయ జట్ల సిరీస్‌లు, ఇతర ఒప్పందాల ప్రకారం వారు ఐపీఎల్‌లో కొనసాగే అవకాశం లేదు. ఐపీఎల్ తేదీల ప్రకారమే తాము ఎన్‌ఓసీలు జారీ చేశామని, దీనిపై మళ్లీ చర్చించిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. న్యూజిలాండ్ బోర్డు కూడా దాదాపు ఇదే తరహాలో స్పందించింది. మరి బీసీసీఐ ప్రయత్నాలు ఫలిస్తాయా? విదేశీ ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్‌కు తిరిగి వస్తారా? అన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది. ఇక బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ ముందు గట్టి దెబ్బ తగిలేలా ఉంది. విదేశీ ఆటగాళ్లు దూరం కావడం, కెప్టెన్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద తలనొప్పి అని చెప్పొచ్చు.
#TATAIPL is back in action on 17th May 🗓
With the playoff race heating up, which fixture are you most excited for? 🙌
Check out the full schedule 🔽 pic.twitter.com/OoRlYEpAUb
— IndianPremierLeague (@IPL) May 14, 2025







