AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడ్డూ భాయ్.. టెస్టు క్రికెట్‌లో ఆల్‌టైమ్ నెం1!

భార‌త స్టార్ ప్లేయర్, ఆల్‌ రౌండర్ ర‌వీంద్ర జ‌డేజా టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. తాజాగా ఐసీసీ విడుద‌ల చేసిన టెస్ట్ ఆల్‌రౌండ‌ర్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచాడు. ఇదే కాకుండా 1,151 రోజులుగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉంటూ.. ఎక్కువ కాలం పాటు ఈ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొన‌సాగుతున్న ప్లేయర్‌గా జడేజా రికార్డు సృష్టించారు.

Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడ్డూ భాయ్.. టెస్టు క్రికెట్‌లో ఆల్‌టైమ్ నెం1!
Ravindra Jadeja
Anand T
|

Updated on: May 14, 2025 | 9:28 PM

Share

భార‌త స్టార్ ప్లేయర్, ఆల్‌ రౌండర్ ర‌వీంద్ర జ‌డేజా టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. తాజాగా ఐసీసీ విడుద‌ల చేసిన టెస్ట్ ఆల్‌రౌండ‌ర్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలి రికార్డుకెక్కాడు. ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో 400 పాయింట్లతో జడేజా మొదటి స్థానంలో ఉండగా 327 పాయింట్లతో బంగ్లాదేశ్‌కు చెందిన‌ మెహదీ హసన్ మీరాజ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక 294 పాయింట్లతో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు మార్కో యన్సెన్ మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టాప్ 10లో ఉన్న ఏకైక భారత ఆల్ రౌండర్ జడేజానే.

2024 ఐసీసీ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న జడేజా, టెస్ట్ చరిత్రలో నంబర్ వన్ ఆల్ రౌండర్‌గా ఎక్కువ కాలం కొనసాగిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. వరుసగా 1,151 రోజులు గడిచిన తర్వాత అతను ఇప్పుడు నంబర్ 1 టెస్ట్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు. గత సంవత్సరం మంచి ఫామ్‌లో ఉన్న జడేజా, 29.27 సగటుతో 527 పరుగులు చేశాడు. అదే సమయంలో, అతను 24.29 సగటుతో 48 వికెట్లు పడగొట్టాడు.

ICC టెస్ట్ ఆల్-రౌండర్ ర్యాంకింగ్స్ టాప్ 10లో ఉన్న ప్లేయర్స్..

  • రవీంద్ర జడేజా (భారతదేశం) – 400 పాయింట్లు
  • మెహిదీ హసన్ మీరాజ్ (బంగ్లాదేశ్) – 327 పాయింట్లు
  • మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా) – 294 పాయింట్లు
  • పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 271 పాయింట్లు
  • షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 253 పాయింట్లు
  • జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) – 249 పాయింట్లు
  • జో రూట్ (ఇంగ్లాండ్) – 247 పాయింట్లు
  • గస్ అట్కిన్సన్ (ఇంగ్లాండ్) – 240 పాయింట్లు
  • బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) – 235 పాయింట్లు
  • క్రిస్ వోక్స్ (ఇంగ్లాండ్) – 225 పాయింట్లు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..