అందరూ అనుకున్నట్టే జరిగింది.! వచ్చే ఏడాది ఐపీఎల్‌లో బెంగళూరుకు ‘కే..జీ..ఎఫ్’ మెరుపులు ఇక లేనట్టే. న్యూ కోచ్.. సరికొత్త టీం.. చిగురిస్తోన్న ట్రోఫీ కలతో.. ఈసారి ఆర్సీబీ బలమైన జట్టుగా బరిలోకి దిగనుంది. ఇందులో భాగంగానే ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్సీబీ ఫ్రాంచైజీ.. జట్టులో కీలకమైన ముగ్గురు మొనగాళ్లను రిటైన్ చేసుకుంది. అంతేకాకుండా మెగా వేలంలో జట్టుకు సరైన కెప్టెన్ లభించకపోతే.. ఈసారి విరాట్ కోహ్లీ RCB పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా
ఇక రిటైన్ లిస్టు చూస్తే.. మొదటి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రిటైన్ కాగా.. ఆ తర్వాత రజత్ పటిదర్, యష్ దయాల్‌లను రిటైన్ చేసుకుంది ఫ్రాంచైజీ. విరాట్ కోహ్లీ ఈసారి రూ. 21 కోట్లు తీసుకోనుండగా.. రజత్ పటిదర్ రూ. 11 కోట్లు, యష్ దయాల్ రూ. 5 కోట్ల పారితోషికం అందుకోనున్నారు. ఈ లిస్టులో సిరాజ్‌కు బదులుగా యష్ దయాల్ పేరు ఉండటం.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం సిరాజ్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఇక యష్ దయాల్ ఈ ఏడాది ఐపీఎల్‌లో అదరగొట్టాడు. అందుకే సిరాజ్‌కు బదులుగా యష్ దయాల్ వైపే మొగ్గు చూపించింది RCB ఫ్రాంచైజీ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
విరాట్ కోహ్లీ (INR 21 కోట్లు),
యశ్ దయాల్ (INR 5 కోట్లు)
మిగిలిన పర్స్: INR 83 కోట్లు (INR 120 కోట్లలో)
రైట్-టు-మ్యాచ్ (RTM): 3
ఫాఫ్ డుప్లెసిస్, అనూజ్ రావత్(కీపర్), దినేశ్ కార్తీక్(రిటైర్మెంట్), సుయాష్ ఎస్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, సౌరవ్ చౌహన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్, మయాంక్ దగర్, మనోజ్ భాండగే, స్వప్నిల్ సింగ్, ఆకాశ్ దీప్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ సిరాజ్, టామ్ కరణ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రజన్ కుమార్, విజయ్ కుమార్ వైశాఖ్
The Retention Saga EXPLAINED! 🫡
Why Virat Kohli, Rajat Patidar and Yash Dayal?
Director of Cricket Mo Bobat and Head Coach Andy Flower announce the retentions and explain RCB’s thought process heading into the Mega Auction, on @bigbasket_com presents RCB Bold Diaries. 👏… pic.twitter.com/HKUWdaDXIa
— Royal Challengers Bengaluru (@RCBTweets) October 31, 2024
Retentions done right! Fair value to the retained players and a huge purse to help us build a formidable squad. 🤝
Virat Kohli: 2️⃣1️⃣Cr
Rajat Patidar: 1️⃣1️⃣Cr
Yash Dayal: 5️⃣CrPurse Remaining: 8️⃣3️⃣Cr#PlayBold #ನಮ್ಮRCB #IPLRetention #IPL2025 pic.twitter.com/LvOi5zVxqf
— Royal Challengers Bengaluru (@RCBTweets) October 31, 2024
ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..