AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 Playoffs: 3 జట్లు ఫిక్స్.. ఒక్క ప్లేస్ కోసం 4 జట్ల పోరు.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న ప్లే ఆఫ్స్ రేసు

IPL Playoffs 2025 Scenario: సన్‌రైజర్స్ ఆశలు ఇప్పటికే ఆవిరయ్యాయి. కానీ, బెంగళూరు లాగా 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలని కలలుకనాల్సి ఉంటుంది. హైదరాబాద్ జట్టు కల వర్షం వల్ల చెదిరిపోయింది. సన్‌రైజర్స్ 11 మ్యాచ్‌ల్లో 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా ఎస్‌ఆర్‌హెచ్13 పాయింట్లకు మాత్రమే చేరుకోగలుగుతుంది.

IPL 2025 Playoffs: 3 జట్లు ఫిక్స్.. ఒక్క ప్లేస్ కోసం 4 జట్ల పోరు.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న ప్లే ఆఫ్స్ రేసు
Ipl 2025 Playoffs
Venkata Chari
|

Updated on: May 06, 2025 | 1:45 PM

Share

IPL Playoffs 2025 Scenario: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఐపీఎల్ 2025లో భాగంగా జరగాల్సిన 55వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆతిథ్య సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలో పాయింట్ దక్కించుకున్నాయి. ఈ కీలక మ్యాచ్ రద్దు కావడంతో, హైదరాబాద్ జట్టు అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఢిల్లీకి కూడా భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు 4 స్థానాల కోసం ప్లేఆఫ్ రేసులో 7 జట్లు మిగిలి ఉన్నాయి. సన్‌రైజర్స్‌కు ముందు, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ నిష్క్రమించాయి.

ఐదో స్థానంలో ఢిల్లీ..

కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు మిశ్రమ ఫలితాలను సాధించింది. ఆ జట్టు ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. ఢిల్లీ తన సీజన్‌ను వరుసగా నాలుగు విజయాలతో బలంగా ప్రారంభించింది. కానీ, వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. 11 మ్యాచ్‌లు ఆడి 6 గెలిచింది. డిల్లీ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఒక మ్యాచ్ రద్దు చేశారు. ఈ విధంగా ఢిల్లీ ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. ఢిల్లీ జట్టు నెట్ రన్ రేట్ +0.362గా ఉంది. ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

ప్లేఆఫ్ అర్హతలు..

18 పాయింట్లు (9 విజయాలు): ప్లేఆఫ్ బెర్త్ పక్కా.

ఇవి కూడా చదవండి

16 పాయింట్లు (8 విజయాలు): ప్లే ఆఫ్ బెర్త్ దాదాపుగా ఖాయం.

14 పాయింట్లు (7 విజయాలు): నెట్ రన్ రేట్, ఇతర జట్ల ఫలితాల ఆధారంగా అర్హత (RCB 2024లో ఈ స్థాయికి చేరుకుంది).

12 పాయింట్లు (6 విజయాలు): చాలా కష్టం. ఒక జట్టు 12 పాయింట్లతో అర్హత సాధించింది ఒక్కసారి మాత్రమే (2019లో SRH).

ఢిల్లీకి సమీకరణాలు..

ఢిల్లీ జట్టు మే 8న పంజాబ్ కింగ్స్‌తో, మే 11న గుజరాత్ టైటాన్స్‌తో, మే 17న ముంబై ఇండియన్స్‌తో ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే, ఢిల్లీ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంది. ఈ సందర్భంలో ఢిల్లీ 19 పాయింట్లను కలిగి ఉంది. టాప్-2కి కూడా చేరుకోవచ్చు. ఢిల్లీ జట్టు 2 విజయాలు సాధిస్తే 17 పాయింట్లు ఉంటాయి. అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది. ఒక మ్యాచ్ గెలిస్తే, ఢిల్లీ జట్టు 15 పాయింట్లతో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

సన్‌రైజర్స్ హార్ట్ బ్రేక్..

సన్‌రైజర్స్ ఆశలు ఇప్పటికే ఆవిరయ్యాయి. కానీ, బెంగళూరు లాగా 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలని కలలుకనాల్సి ఉంటుంది. హైదరాబాద్ జట్టు కల వర్షం వల్ల చెదిరిపోయింది. సన్‌రైజర్స్ 11 మ్యాచ్‌ల్లో 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా ఎస్‌ఆర్‌హెచ్13 పాయింట్లకు మాత్రమే చేరుకోగలుగుతుంది.

ప్లేఆఫ్ రేసులో ఏ జట్లు ఉన్నాయంటే?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 11 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు, ఇంకా 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

పంజాబ్ కింగ్స్- 11 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు, 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

ముంబై ఇండియన్స్- 11 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు, ఇంకా 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

గుజరాత్ టైటాన్స్ – 10 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు, ఇంకా 4 మ్యాచ్‌లు ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్- 11 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లు, ఇంకా 3 మ్యాచ్‌లు ఉన్నాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్ – 11 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లు, ఇంకా 3 మ్యాచ్‌లు ఉన్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్ – 11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు, ఇంకా 3 మ్యాచ్‌లు ఉన్నాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..