IPL 2025: రోహిత్ నుంచి ధోని వరకు.. స్టార్ ప్లేయర్లకు డెడ్ లైన్ పెట్టిన బీసీసీఐ.. అదేంటంటే?

IPL Mega Auction: ఐపీఎల్ తదుపరి ఎడిషన్‌కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఈ వేలానికి సంబంధించిన రిటెన్షన్ నిబంధనలను ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది. దీని ప్రకారం, రాబోయే మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను జట్టులో ఉంచుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలను బీసీసీఐ అనుమతించింది. ఇది కాకుండా, ఒక ఆటగాడు RTM కార్డ్ ఉపయోగించి అతని జట్టులో తిరిగి చేరడానికి కూడా అనుమతించనున్నారు.

IPL 2025: రోహిత్ నుంచి ధోని వరకు.. స్టార్ ప్లేయర్లకు డెడ్ లైన్ పెట్టిన బీసీసీఐ.. అదేంటంటే?
Ipl 2025 Rohit Dhoni
Follow us
Venkata Chari

|

Updated on: Sep 30, 2024 | 8:30 AM

IPL Mega Auction: ఐపీఎల్ తదుపరి ఎడిషన్‌కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఈ వేలానికి సంబంధించిన రిటెన్షన్ నిబంధనలను ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది. దీని ప్రకారం, రాబోయే మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను జట్టులో ఉంచుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలను బీసీసీఐ అనుమతించింది. ఇది కాకుండా, ఒక ఆటగాడు RTM కార్డ్ ఉపయోగించి అతని జట్టులో తిరిగి చేరడానికి కూడా అనుమతించనున్నారు. ఫ్రాంచైజీలంతా రిటెన్షన్ జాబితాను పాలకమండలికి ఎప్పుడు సమర్పించాలనే దానిపై బీసీసీఐ గడువు విధించింది. దీని ప్రకారం అక్టోబర్ 31 నాటికి మొత్తం 10 ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ఐదుగురు ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, BCCI మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను మెగా వేలానికి ముందు ప్రకటించేందుకు అక్టోబర్ 31, 2024ని గడువుగా నిర్ణయించింది. ఈ తేదీన సాయంత్రం 5 గంటలలోపు అన్ని జట్లు తాము అట్టిపెట్టుకున్న ఐదుగురు ఆటగాళ్ల పేర్లను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది.

ఇది కొత్త నిబంధన..

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి మరో పెద్ద వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం, అక్టోబర్ 31 లోపు అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడు క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించబడతాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియాను ప్రకటించారు. ఈ జట్టులో మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ వంటి యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఈ ఆటగాళ్లు ప్రస్తుతం అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు, బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఆడే అవకాశం ఎవరికి లభిస్తే వారు క్యాప్డ్ జాబితాలో ఉంటారు.

పెరిగిన పర్స్ పరిమాణం..

ఈ మెగా వేలం కోసం పాలకమండలి ఫ్రాంచైజీ పర్స్ పరిమాణాన్ని కూడా పెంచింది. దీని ప్రకారం, ప్రతి ఫ్రాంచైజీ పర్స్ పరిమాణం తదుపరి ఎడిషన్ నుంచి రూ. 100 కోట్ల నుంచి రూ. 120 కోట్లకు పెరిగింది. అయితే, ఈ వేలం పర్స్ నుంచి రిటైన్ చేసిన ఆటగాళ్ల మొత్తం తీసివేయనున్నారు. ఈ విధంగా, ఫ్రాంచైజీ మొత్తం ఐదుగురు ఆటగాళ్లను ఉంచుకుంటే, దాని వేలం పర్స్ రూ. 120 కోట్ల నుంచి రూ. 75 కోట్లు తీసివేయాల్సి ఉంటుంది. మిగిలిన రూ.45 కోట్లతో మిగిలిన 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..