AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ముచ్చటగా మూడోసారి ఫ్లాప్.. ఐపీఎల్ కాస్ట్లీ ప్లేయర్‌పై ఫ్యాన్స్ ఫైర్..

Lucknow Super Giants Captain Rishabh Pant Flop: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టుకు ఆరంభం అంతగా బాగోలేదు. తొలి దశలోనే మిచెల్ మార్ష్ జీరోకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఐడెన్ మార్క్రమ్ బౌండరీలతో చెలరేగాడు. కానీ అతను భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పంత్‌పై భారీ ఆశలు నెలకొన్నాయి. కానీ, కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

IPL 2025: ముచ్చటగా మూడోసారి ఫ్లాప్.. ఐపీఎల్ కాస్ట్లీ ప్లేయర్‌పై ఫ్యాన్స్ ఫైర్..
Rishabh Pant Lsg Captain
Venkata Chari
|

Updated on: Apr 01, 2025 | 9:42 PM

Share

Lucknow Super Giants Captain Rishabh Pant Flop: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యేకంగా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో లక్నో జట్టు తనకోసం వెచ్చించిన రూ. 27 కోట్లకు సరైన న్యాయం చేయలేకపోతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లోని మొదటి మూడు మ్యాచ్‌లలో కేవలం 17 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్ 2025లోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ ఇలాంటి ప్రదర్శన చేస్తుండడం అటు ఫ్రాంచైజీతోపాటు ఇటు ఫ్యాన్స్ కూడా ఏకిపారేస్తున్నారు. నెటిజన్లు మాత్రం కెప్టెన్‌గా పీకిపారేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిని ఔట్ చేసిన మాక్స్‌వెల్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టుకు ఆరంభం అంతగా బాగోలేదు. తొలి దశలోనే మిచెల్ మార్ష్ జీరోకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఐడెన్ మార్క్రమ్ బౌండరీలతో చెలరేగాడు. కానీ అతను భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పంత్‌పై భారీ ఆశలు నెలకొన్నాయి. కానీ, కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

గ్లెన్ మాక్స్వెల్ లెగ్ సైడ్ వైపు ఒక లెంగ్త్ బాల్ సంధించాడు. పంత్ బంతిని మిస్ టైమింగ్ చేశాడు. షార్ట్-ఫైన్ లెగ్ వద్ద యుజ్వేంద్ర చాహల్ ఒక సింపుల్ క్యాచ్ పట్టాడు. దీంతో మాక్స్వెల్ పంత్‌ను అవుట్ చేయడం ఓ అలవాటుగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. 4 ఇన్నింగ్స్ లలో పంత్‌ను మూడుసార్లు అవుట్ చేశాడు.

పంత్ ఫ్లాప్ షో..

రూ. 27 కోట్లు దక్కించుకున్న పంత్.. ఈ సీజన్‌లోకి వచ్చే ముందే తీవ్ర ఒత్తిడిలో కూరుకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో డకౌట్ కావడంతో పంత్ బ్యాటింగ్‌పై ఒత్తిడి కనిపించింది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులు చేయగా, పంజాబ్‌పై కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..