IPL 2025: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్‌కు సిద్ధమవుతోన్న టీమిండియా టాప్ ప్లేయర్

ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హోరా హోరీగా జరుగుతోంది. ఎనిమిది బలమైన జట్ల మధ్య జరుగుతోన్న ఈ పోరు కావడంతో రాబోయే మ్యాచ్ లు మరింత రసవత్తరంగా మారనున్నాయి. కాగా ఈ మెగా క్రికెట్ టోర్నీ పూర్తయిన తర్వాత ధనాధన్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది.

IPL 2025: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్‌కు సిద్ధమవుతోన్న టీమిండియా టాప్ ప్లేయర్
IPL 2025

Updated on: Feb 22, 2025 | 11:18 AM

టీం ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో వెన్నునొప్పి తో బాధపడిన అతను చికిత్స తీసుకున్నాడు. అయితే, అతను ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగుతాడని అభిమానులు భావించారు. కానీ గాయం నుంచి కోలుకోవడానికి అతనికి మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో, బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. కాగా జస్ప్రీత్ బుమ్రా తన పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. దీని ప్రకారం, రాబోయే ఐపీఎల్‌లో యార్కర్ స్పెషలిస్ట్ మళ్లీ మైదానంలోకి రావడం ఖాయం. అంటే మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో బుమ్రా బరిలోకి దిగనున్నాడని తెలుస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీకి జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో, అతని స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాకు అవకాశం లభించింది. అలా జట్టులోకి వచ్చిన రాణా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7.4 ఓవర్లలో 31 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించాడు. ఇక ఆదివారం ( ఫిబ్రవరి 23) పాకిస్థాన్‌తో జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌కు నాయకత్వం వహిస్తారని చెప్పవచ్చు. హార్దిక్ పాండ్యా మూడో పేసర్‌గా కనిపించనున్నాడు. దీనితో పాటు, అర్ష్‌దీప్ సింగ్‌కు ప్లేయింగ్ స్క్వాడ్‌లో స్థానం లభిస్తుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

ప్రారంభ మ్యాచ్ లకు దూరమైనా…

 

కొత్త జెర్సీలతో ముంబై ఆటగాళ్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..