IPL 2025: ఇట్స్ అఫీషియల్.. ఢిల్లీ కొత్త కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్.. ఈసారైనా కప్ వచ్చేనా?
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్- 2025 మార్చి 22న ప్రారంభమవుతుంది. అంటే టోర్నమెంట్ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ తమ కొత్త కెప్టెన్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఇంతకు ముందు రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉండగా వేలంలో అతను లక్నో సూపర్ జెయింట్స్ కు వెళ్లిపోయాడు.

IPL 2025 కి ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే అక్షర్ పటేల్ కు జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడీ ఆల్ రౌండర్. దీంతో ఢిల్లీ ఫ్రాంఛైజీ అక్షర్ కే సారథ్య బాధ్యతలను కట్టబెట్టింది. ఇక కెప్టెన ఎంపికతో ఢిల్లీ అభిమానుల నిరీక్షణ కూడా ముగిసింది. ఎందుకంటే ఇప్పటవరకు కెప్టెన్‌ను ప్రకటించని ఏకైక జట్టు ఇదే. ఐపీఎల్ ఆడుతున్న 10 జట్లలో 9 జట్లు ఇప్పటికే తమ కెప్టెన్ల పేర్లను ప్రకటించాయి. కాగా గత ఏడు సీజన్లుగా ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడీ స్టార్ ఆల్ రౌండర్. ఇప్పటివరకు అక్షర్ పటేల్ 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. దాదాపు 131 స్ట్రైక్ రేట్‌తో 1653 పరుగులు చేశాడు. అలాగే 7.28 ఎకానమీ రేటుతో 123 వికెట్లు పడగొట్టాడు. అయితే, అతనికి కెప్టెన్సీ అనుభవం లేదు. కానీ, తన ఆల్ రౌండ్ ఆటతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెన్నెముకగా నిలుస్తూ వస్తున్నాడు అక్షర్.
కాగా అక్షర్ పటేల్ కంటే ముందు ఈ సీజన్‌లో జట్టులోకి వచ్చిన కెఎల్ రాహుల్, కెప్టెన్సీ రేసులో ముందంజలో నిలిచాడు. రాహుల్ కు టీం ఇండియాతో పాటు, ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం ఉంది. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలను రాహుల్ కు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే కెప్టెన్సీని రాహుల్ నిరాకరించాడని తెలిసింది. దీంతో అక్షర్ కు మార్గం సుగమం అయింది. రాహుల్ నిరాకరించిన తర్వాత, యాజమాన్యం అక్షర్‌ను కెప్టెన్‌గా చేయాలని నిర్ణయించింది. ఈ సీజన్ కోసం ఢిల్లీ జట్టు అతనిని రూ.16.50 కోట్లతో రిటైన్ చేసుకుంది.
కేఎల్ రాహుల్ కాదనడంతో..
🚨 AXAR PATEL – CAPTAIN OF DELHI CAPITALS IN IPL 2025. 🚨 pic.twitter.com/XOkAnA1G23
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 14, 2025
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు..
అక్షర్ పటేల్ (కెప్టెన్), కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్క్, కెఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, టి నటరాజన్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ఫాఫ్ డు ప్లెసిస్, ముఖేష్ కుమార్, దర్శన్ నల్కాండే, విపరాజ్ నిగమ్, దుష్మంత చమీర, మాధవ్ తివారీ, త్రిపుర్ణ విజయ్, మన్వంత్ కుమార్, అజయ్ మండల్, డోనోవన్ ఫెరీరా.
Aap sabko dil se Holi ki hardik shubhkamnayein ❤️💙 pic.twitter.com/r8QFrsBLJI
— Delhi Capitals (@DelhiCapitals) March 14, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..