MI vs KKR, IPL 2024: బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?

Mumbai Indians vs Kolkata Knight Riders: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లు అదరగొట్టారు. ఇన్నింగ్స్ ఆరంభంలో నువాన్ తుషారా చెలరేగగా, ఆ తర్వాత జస్ ప్రీత్ బుమ్రా తన పేస్ పదును చూపించాడు. ఫలితంగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కుదిగిన కోల్ కతా నైట్ రైడర్స్..

MI vs KKR, IPL 2024: బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
MI vs KKR, IPL 2024

Updated on: May 03, 2024 | 9:31 PM

Mumbai Indians vs Kolkata Knight Riders: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లు అదరగొట్టారు. ఇన్నింగ్స్ ఆరంభంలో నువాన్ తుషారా చెలరేగగా, ఆ తర్వాత జస్ ప్రీత్ బుమ్రా తన పేస్ పదును చూపించాడు. ఫలితంగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కుదిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటయ్యింది. వెంకటేశ్‌ అయ్యర్ ( 52 బంతుల్ 70, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన మనీష్‌ పాండే (42) ఓ మోస్తరుగా ఆడాడు. వీరిద్దరు మినహా మిగతా వారెవ్వరూ రాణించలేదు. ఫిలిప్ సాల్ట్‌ (5), నరైన్‌ (8), రఘువంశీ (13), శ్రేయస్ (6), రింకూ సింగ్‌ (9), ఆండ్రీ రసెల్‌ (7) పూర్తిగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో తుషారా, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టగా, హార్దిక్‌ 2, పీయూష్‌ ఒక వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్ లో గెలవడం ముంబై కు అత్యంత కీలకం. మరి ఇప్పుడు ఆ జట్టు భారమంతా బ్యాటర్లపైనే ఉంది.

రాణించిన జస్ ప్రీత్ బుమ్రా..

ముంబై ఇండియన్స్   ప్లేయింగ్ 11

ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార

ఇంపాక్ట్ ప్లేయర్లు:

రోహిత్ శర్మ, షామ్స్ ములానీ, శివాలిక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి

ఇంపాక్ట్ ప్లేయర్లు:

అనుకుల్ రాయ్, మనీష్ పాండే, శ్రీకర్ భరత్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, చేతన్ సకారియా

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..