IPL 2024 టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ కు ఇక ఒక మ్యాచ్ మిగిలి ఉంది. మే 17న లక్నో సూపర్ జెయింట్‌తో మ్యాచ్ జరగనుంది. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి మాత్రం ప్లేఆఫ్స్ చేరకుండానే తన ప్రయాణాన్ని ముగించింది. ఇక ఆఖరి మ్యాచ్ లాంఛనం మాత్రమే. దీంతో ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్ మధ్య కుస్తీ పోటీని చూడవచ్చు. ఓ వైపు ఇతర ముంబై ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్ జంటగా కనిపించారు. ఫన్నీ ప్రిడిక్షన్‌లో వీరిద్దరి మధ్య కుస్తీ పోటీ జరిగింది. ఈ రెజ్లింగ్ వీడియోను ముంబై ఇండియన్స్ తమ అభిమానుల కోసం సోషల్ మీడియా ఖాతాల్లో అప్‌లోడ్ చేసింది.
ఇషాన్ కిషన్ 6 అడుగుల టిమ్ డేవిడ్‌ను ను కిందపడేయాలని తన వంతు ప్రయత్నాలు చేశాడు. కానీ అదేమీ జరగలేదు. ఎందుకంటే టిమ్ డేవిడ్ ఒక బలమైన అథ్లెట్. అందుకే ఇషాన్ కిషన్ ను పట్టుకుని ఇట్టే నేలపై పడేశాడు. ఈ సమయంలో ఇతర ఆటగాళ్లు ప్రేక్షకుల పాత్ర పోషించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. కాగా టీ20 ప్రపంచకప్ జట్టు లో ఇషాన్ కిషన్ కు స్థానం దక్కలేదు. కాబట్టి మే 17న ముంబై ఇండియన్స్‌తో జరిగే చివరి మ్యాచ్ తర్వాత ఇషాన్ కిషన్ విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో టిమ్ డేవిడ్ ఎంపికయ్యాడు. టిమ్ డేవిడ్ గాయపడి ఉంటే, టీ20 ప్రపంచకప్‌కు ముందే ఆస్ట్రేలియా దెబ్బతినేది. కానీ అదృష్టవశాత్తూ అలాంటిదేమీ జరగలేదు.
Warning: These are trained professionals, don’t try this at home 😂 #MumbaiMeriJaan #MumbaiIndians | @ishankishan51 | @timdavid8 pic.twitter.com/GcSsfOJ7Qh
— Mumbai Indians (@mipaltan) May 16, 2024
కాగా ఈ విజయంతో టోర్నీని ముగించాలని ముంబయి ఇండియన్స్ ప్రయత్నిస్తోంది. ముంబై ఇండియన్స్‌లో వెటరన్ ప్లేయర్లు ఉన్నప్పటికీ, పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్లు కనిపించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్‌లో ఆశించిన మేర రాణించలేదు. ఇప్పుడు, తదుపరి సీజన్‌లో, ముంబై ఇండియన్స్ వేలంలో ఎవరిని విడుదల చేస్తుంది, ఎవరిని జట్టులోకి తీసుకుంటారు అనేది ఆసక్తిగా ఉంది. IPL 2025కి ముందు మెగా వేలం జరగనుంది.
1️⃣5️⃣0️⃣ 𝐤𝐦𝐩𝐡, 𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐫𝐢𝐠𝐡𝐭 𝐚𝐭 𝐲𝐨𝐮 🔥#MumbaiMeriJaan #MumbaiIndians | @GeraldCoetzee62 pic.twitter.com/LXPZEDvhIb
— Mumbai Indians (@mipaltan) May 16, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..