మే 2023.. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ తర్వాత లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో కనిపించిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. అయితే ఏడాదిలోపు పరిస్థితి పూర్తిగా మారిపోతుందని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. గత ఏడాది గ్రౌండ్ లో ఘర్షణ పడిన విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వీరిద్దరి మధ్య పాత స్నేహం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్ శిక్షణా శిబిరంలోకి ప్రవేశించి గంభీర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపాడు. ఐపీఎల్ 2024లో బెంగళూరు, కోల్‌కతా జట్లు రెండోసారి తలపడనున్నాయి. అంతకుముందు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు తలపడ్డాయి. మార్చి 29న జరిగిన ఆ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. బెంగళూరు బ్యాటింగ్ సమయంలో, కోహ్లీ క్రీజులో ఉండగా, స్ట్రాటెజిక్ టైమ్ సమయంలో కోల్‌కతా మెంటర్ గంభీర్ మైదానంలోకి వచ్చి నేరుగా కోహ్లీ వద్దకు వెళ్లాడు. ఇద్దరూ కౌగిలించుకుని మాట్లాడుకోవడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. హమ్మయ్య.. కోహ్లీ, గంభీర్ కూడా కలిసిపోయారని క్రికెట్ అభిమానులు కూడా తెగ హ్యాఫీగా ఫీలయ్యారు.
🔴 #KnightLive | Stay tuned for more action from KKR and RCB’s pre-match training session at Eden Gardens#AmiKKR | Gautam Gambhir | Virat Kohli pic.twitter.com/M1LFBm9dFQ
ఇవి కూడా చదవండి— KolkataKnightRiders (@KKRiders) April 20, 2024
ఆదివారం (ఏప్రిల్ 21) కోల్ కతా, ఆర్సీబీ జట్ల మధ్య పోరు జరగనుంది. దీనికి ఒకరోజు ముందు కోహ్లి, గంభీర్‌లు ఈడెన్ గార్డెన్స్‌లో కలుసుకున్నారు. కోహ్లి KKR శిక్షణా శిబిరానికి వెళ్లి గంభీర్‌తో చాలా సేపు మాట్లాడాడు. ఇద్దరి మధ్య జరిగిన చర్చ కాస్త సీరియస్‌గా అనిపించినా ఆ తర్వాత వెళ్లిపోయే సమయంలో నవ్వులు, జోకులు కూడా వచ్చాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ వీడియోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.
Jhappi laga liya. Masala khatam 😋
Things we love to see on a cricket field 💜❤️ pic.twitter.com/XDvpGyLcQ2
— KolkataKnightRiders (@KKRiders) April 20, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి