IPL 2024: హమ్మయ్యా! కోహ్లీ- గంభీర్ కలిసిపోయారు..మ్యాచ్ మధ్యలో హగ్ చేసుకున్న క్రికెటర్లు.. వీడియో

|

Mar 29, 2024 | 10:29 PM

ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే కోహ్లీ, గంభీర్ కలిసిపోయారు. మ్యాచ్ మధ్యలో పరస్పరం హగ్ చేసుకున్నారు. స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయంలో గంభీర్ గ్రౌండ్ లోకి వచ్చి కోహ్లీని హత్తుకున్నాడు. ఇద్దరు కొద్ది సేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

IPL 2024: హమ్మయ్యా! కోహ్లీ- గంభీర్ కలిసిపోయారు..మ్యాచ్ మధ్యలో హగ్ చేసుకున్న క్రికెటర్లు.. వీడియో
Virat Kohli, Gautam Gambhir
Follow us on

ఐపీఎల్ టోర్నీఆసక్తికరంగా జరుగుతోంది. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచేందుకు జట్లు అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక ధనాధన్ టోర్నీలో పదో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య నెలకొన్న వివాదం కారణంగా ఈ మ్యాచ్ పై ఆసక్తి పెరిగింది. అయితే మ్యాచ్ మధ్యలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే కోహ్లీ, గంభీర్ కలిసిపోయారు. మ్యాచ్ మధ్యలో పరస్పరం హగ్ చేసుకున్నారు. స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయంలో గంభీర్ గ్రౌండ్ లోకి వచ్చి కోహ్లీని హత్తుకున్నాడు. ఇద్దరు కొద్ది సేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత సీజన్‌లో విరాట్‌ కోహ్లి, గౌతమ్‌ గంభీర్‌ల మధ్య వివాదం నెలకొంది. అంతకుముందు కొన్ని సీజన్లలో ఇద్దరూ తలపడ్డారు. అందుకే, ఈ సీజన్‌లో కూడా అలాంటిదేదో జరుగుతుందని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ఇద్దరూ కలిసిపోయి అభిమానులను సర్ ప్రైజ్ చేశారీ స్టార్ క్రికెటర్లు.వన్డే ప్రపంచకప్‌లో నవీన్‌ ఉల్‌ హక్‌, విరాట్‌ కోహ్లి మధ్య పోరు ముగిసింది. ఇప్పుడు గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య వివాదం ముగిసింది.

 

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. విరాట్ వేసిన స్టెప్‌ని క్రీడా నిపుణులు అభినందిస్తున్నారు. ఇద్దరి మధ్య సయోధ్యతో సరదా అంతా పోయిందని ఓ యూజర్ రాశారు. ఇంకో యూజర్ బాగుందని.. అప్పుడు కూడా నవీన్ ఉల్ హక్ తో స్నేహం కుదిరింది. ఇప్పుడు గంభీర్ విషయంలోనూ అదే జరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

కోహ్లీ, గంభీర్ ల ముచ్చట్లు..

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రమణదీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..