CSK vs LSG, IPL 2024: సెంచరీతో రఫ్పాడించిన రుతురాజ్.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?

Chennai Super Kings Vs Lucknow Super Giants: చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు మళ్లీ అదరగొట్టారు. సొంత గడ్డపై చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్లో చెలరేగి ఆడారు. మొదట కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ( 60 బంతుల్లో 108 నాటౌట్, 12ఫోర్లు, 3 సిక్సర్లు) శతక్కొట్టాడు. ఆ తర్వాత సూపర్ ఫామ్ లో ఉన్న శివమ్ దూబే (27 బంతుల్లో 66, 3 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు.

CSK vs LSG, IPL 2024: సెంచరీతో రఫ్పాడించిన రుతురాజ్.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
Chennai Super Kings

Updated on: Apr 23, 2024 | 9:38 PM

Chennai Super Kings Vs Lucknow Super Giants: చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు మళ్లీ అదరగొట్టారు. సొంత గడ్డపై చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్లో చెలరేగి ఆడారు. మొదట కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ( 60 బంతుల్లో 108 నాటౌట్, 12ఫోర్లు, 3 సిక్సర్లు) శతక్కొట్టాడు. ఆ తర్వాత సూపర్ ఫామ్ లో ఉన్న శివమ్ దూబే (27 బంతుల్లో 66, 3 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో చెన్నై… నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్‌ రహానే (1), డారిల్ మిచెల్‌ (11), రవీంద్ర జడేజా (16) నిరాశపరిచారు. ఇన్నింగ్స్ ఆఖరి బంతి ఎదుర్కొన్న ధోనీ (4 నాటౌట్) బౌండరీ బాదాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో హెన్రీ, మోసిన్‌ ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

సెంచరీతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్..

రెండు జట్ల XI ప్లేయింగ్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్, మతీషా పతిరానా.

సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్/కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

దేవదత్ పడిక్కల్, అర్షిన్ కులకర్ణి, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్ చరక్, మణిమారన్ సిద్ధార్థ్

దంచికొట్టిన దూబే.. వీడియో

ధోని ఫినిషింగ్ టచ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..