
అహ్మదాబాద్‌లో గురువారం (మే22) జరిగిన ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిన ఆర్సీబీ భారంగా టోర్నీ నుంచి నిష్ర్కమించింది. కాగా ఈ పరాజయం తర్వాత సీనియర్ ప్లేయర్, RCB వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ IPL నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈ ఐపీఎల్‌లో ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ఆర్‌సీబీకి వీడ్కోలు పలకాలని దినేష్ కార్తీక్ ఆశించాడు. కానీ నిర్ణయాత్మక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో RR జట్టు 2వ క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. RCB జట్టు IPL నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత దినేష్ కార్తీక్ కూడా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. దినేష్ కార్తీక్ తన 17 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 6 జట్లకు ఆడాడు. 2013లో ముంబై ఇండియన్స్ తరఫున ట్రోఫీని గెలుచుకున్నాడు. ఆ తర్వాత పలు జట్లకు ఆడినా టైటిల్ గెలవలేకపోయాడు. ముఖ్యంగా ఆర్‌సీబీకి ట్రోఫీని అందించాలన్న డీకే కల కలగానే మిగిలిపోయింది.
దినేష్ కార్తీక్ తన IPL కెరీర్‌ను 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరపున ఆడడం ద్వారా ప్రారంభించాడు. 2011లో కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) తరపున ఆడాడు. 2012లో ముంబై ఇండియన్స్‌లో భాగమైన డీకే 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు తిరిగి వచ్చాడు. 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు. 2016-17లో గుజరాత్ లయన్స్ తరపున ఆడిన దినేష్ కార్తీక్ 2018 నుండి 2021 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు.
Thank you @DineshKarthik for all the wonderful memories! Your incredible grit has transformed the game.
Happy Retirement
Love from one #DK to another♥️
— DK Suresh (@DKSureshINC) May 23, 2024
ఐపీఎల్‌లో మొత్తం 257 మ్యాచ్‌లు ఆడిన దినేష్ కార్తీక్ 22 అర్ధ సెంచరీలతో మొత్తం 4842 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 97 పరుగులు. దీంతో పాటు ధోని తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వికెట్ కీపర్‌గా కూడా దినేష్ కార్తీక్ రికార్డులకెక్కాడు. ఇన్ని రికార్డులతో డీకే ఇప్పుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు.
Nallaarku DK! 💛
A huge whistle to a career of grit, passion and sheer bravery! #WhistlePoduForever 🥳@DineshKarthik pic.twitter.com/ZGPbFOgCnY— Chennai Super Kings (@ChennaiIPL) May 23, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..