IPL 2024 Points Table: ఖాతా తెరిచిన బెంగళూరు.. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ఎవరిందంటే?
IPL 2024 Points Table updated after RCB vs PBKS: ఈ విజయంతో, RCB IPL 2024 లో తన విజయాల ఖాతాను తెరిచింది. దీంతో పాయింట్ల పట్టికలో కీలక మార్పలు వచ్చాయి. కాగా, ఆదివారం నాడు లక్నో సూపర్ జెయింట్‌ను 20 పరుగుల తేడాతో ఓడించిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

IPL 2024
IPL 2024 Points Table updated after RCB vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో సోమవారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. దీంతో బెంగళూరు జట్టు తొలి విజయాన్ని రుచి చూసింది.
ఈ విజయంతో, RCB IPL 2024 లో తన విజయాల ఖాతాను తెరిచింది. దీంతో పాయింట్ల పట్టికలో కీలక మార్పలు వచ్చాయి. కాగా, ఆదివారం నాడు లక్నో సూపర్ జెయింట్‌ను 20 పరుగుల తేడాతో ఓడించిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి
RCB vs PBKS మ్యాచ్ తర్వాత అప్‌డేట్ చేసిన పాయింట్ల పట్టిక వివరాలు:
| క్రమసంఖ్య | జట్టు | ఆడింది | గెలుపు | ఓటమి | పాయింట్లు | నెట్ రన్ రేట్ |
| 1 | రాజస్థాన్ రాయల్స్ | 1 | 1 | 0 | 2 | +1.000 |
| 2 | చెన్నై సూపర్ కింగ్స్ | 1 | 1 | 0 | 2 | +0.779 |
| 3 | గుజరాత్ టైటాన్స్ | 1 | 1 | 0 | 2 | +0.300 |
| 4 | కోల్‌కతా నైట్ రైడర్స్ | 1 | 1 | 0 | 2 | +0.200 |
| 5 | పంజాబ్ కింగ్స్ | 2 | 1 | 1 | 2 | +0.025 |
| 6 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 2 | 1 | 1 | 2 | -0.180 |
| 7 | సన్‌రైజర్స్ హైదరాబాద్ | 1 | 0 | 1 | 0 | -0.200 |
| 8 | ముంబై ఇండియన్స్ | 1 | 0 | 1 | 0 | -0.300 |
| 9 | ఢిల్లీ రాజధానులు | 1 | 0 | 1 | 0 | -0.455 |
| 10 | లక్నో సూపర్ జెయింట్స్ | 1 | 0 | 1 | 0 | -1.000 |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








