IPL 2024: పాత జట్టులో చేరిన గుజరాత్ కెప్టెన్.. కొత్త గూటికి ముంబై కీలక ప్లేయర్.. ఐపీఎల్ చరిత్రలో భారీ ట్రేడింగ్ ఇదే..

IPL 2024: గుజరాత్ టైటాన్స్ జట్టుకు రెండేళ్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా మరోసారి 5 సార్లు ఛాంపియన్ ముంబై జట్టులోకి వచ్చాడు. అలాగే, ముంబై జట్టులో ఉన్న ఆస్ట్రేలియా జట్టు స్టార్ ఆల్ రౌండర్ కెమరూన్ గ్రీన్ ఆర్సీబీకి మారాడు. ఈమేరకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

IPL 2024: పాత జట్టులో చేరిన గుజరాత్ కెప్టెన్.. కొత్త గూటికి ముంబై కీలక ప్లేయర్.. ఐపీఎల్ చరిత్రలో భారీ ట్రేడింగ్ ఇదే..
Hardik Pandya Green
Follow us
Venkata Chari

|

Updated on: Nov 27, 2023 | 4:28 PM

IPL 2024: హార్దిక్ పాండ్యా(Hardik Pandya) పై కొన్ని రోజులుగా వినిపిస్తున్న రూమర్లకు నేడు తెరపడింది. రెండేళ్ల పాటు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) లో చేరాడు. అలాగే ముంబై జట్టులో ఉన్న ఆస్ట్రేలియా జట్టు స్టార్ ఆల్ రౌండర్ కెమరూన్ గ్రీన్ ఆర్సీబీ (Royal Challengers Bangalore)కి మారాడు. ఈమేరకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

2022 ఐపీఎల్‌కు ముందు జరిగిన మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాను రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత గుజరాత్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన హార్దిక్.. తన నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ జట్టును వరుసగా రెండు ఎడిషన్లలో ఫైనల్స్‌కు చేర్చాడు. ఇందులో 2022 ఐపీఎల్‌లోనూ ఆ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది.

వాస్తవానికి, నిన్న నవంబర్ 26, మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్, డ్రాప్ చేసిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించడానికి చివరి రోజు. దీని ప్రకారం అన్ని జట్లు సమర్పించిన జాబితాలో హార్దిక్ పాండ్యా గుజరాత్ జట్టులో కొనసాగాడు. కానీ, ట్రేడింగ్ విండో తేదీని పొడిగించినందున, ఈ రోజు ముంబై ఫ్రాంచైజీ పాండ్యాను చేర్చుకుంది.

2025లో ‘మెగా వేలం’ జరగనున్న నేపథ్యంలో, ప్రతి ఫ్రాంచైజీ యువ ఆటగాళ్లతో కొత్త జట్టును నిర్మించేందుకు ప్రయత్నిస్తుండగా భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది.

ముంబై జట్టులో హార్దిక్ ప్రయాణం..

2015లో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆ తరువాత, అతను ముంబై ఇండియన్స్ నాలుగు IPL టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్ నైపుణ్యాలతో అద్భుతమైన ఆల్ రౌండర్. ఇప్పటి వరకు 123 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ 2309 పరుగులతో పాటు 53 వికెట్లు కూడా పడగొట్టాడు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..