IND vs AUS: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్ లిఖించిన టీమిండియా టాప్ త్రీ ఆటగాళ్లు.. అదేంటంటే?

IND vs AUS: ఈ మ్యాచ్‌లో యశవ్ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ భారత్‌కు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి, మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ పవర్‌ప్లేలో 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్లో జైస్వాల్ 24 పరుగులు చేశాడు. ఆ తర్వాత కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ, భారీ షాట్ ఆడే ప్రయత్నంలో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆపై మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ వెంటనే దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించి 52 పరుగులు చేశాడు.

Venkata Chari

|

Updated on: Nov 27, 2023 | 4:12 PM

త్రివేండ్రం (Thiruvananthapuram) వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టును 44 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ముగ్గురు బ్యాటర్ల అర్ధ సెంచరీలతో 236 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకు నిర్దేశించింది. అనంతరం ఆస్ట్రేలియా 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తరపున టాప్‌ త్రీ బ్యాట్స్‌మెన్‌ హాఫ్‌ సెంచరీలు సాధించి టీ20 చరిత్రలో సరికొత్త రికార్డుగా నిలిచారు.

1 / 5
ఈ మ్యాచ్‌లో యశవ్ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ భారత్‌కు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి, మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ పవర్‌ప్లేలో 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్లో జైస్వాల్ 24 పరుగులు చేశాడు. ఆ తర్వాత కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ, భారీ షాట్ ఆడే ప్రయత్నంలో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆపై మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ వెంటనే దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించి 52 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 58 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.

2 / 5
దీంతో పాటు టీమ్ ఇండియా టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన బ్యాట్స్‌మెన్ అంటే ఓపెనర్స్ ఇద్దరు, మూడో ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ప్రపంచ క్రికెట్‌లో ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీలు చేయడం ఇది ఐదోసారి.

3 / 5
గతంలో టీ20 ఫార్మాట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు యాభైకి పైగా పరుగులు చేయడం గమనార్హం. అయితే ఇది టాప్‌ త్రీ ప్లేయర్‌ల నుంచి రాలేదు. 2007లో డర్బన్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ తలా యాభై ప్లస్ స్కోర్లు నమోదు చేశారు. అయితే ఈ ముగ్గురూ వరుసగా మొదటి మూడు స్థానాల్లో బరిలోకి దిగలేదు.

4 / 5
అలాగే, 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ యాభైకి పైగా స్కోరు చేశారు. ఆ తర్వాత 2022లో నెదర్లాండ్స్‌పై రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ తలా హాఫ్ సెంచరీలు సాధించారు. కానీ, ఈ ముగ్గురు టాప్ త్రీ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయకపోవడంతో ఈ ఘనత సాధించలేకపోయారు.

5 / 5
Follow us