RCB vs GT, IPL 2024: రాణించిన ఆర్సీబీ బౌలర్లు.. గుజరాత్ ఆలౌట్.. టార్గెట్ ఎంతంటే?

Royal Challengers Bengaluru vs Gujarat Titans: డూ ఆర్ డై మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు సమష్ఠిగా రాణించారు. గుజరాత్ టైటాన్స్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. శనివారం (మే 04) చిన్న స్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటయ్యింది.

RCB vs GT, IPL 2024: రాణించిన ఆర్సీబీ బౌలర్లు.. గుజరాత్ ఆలౌట్.. టార్గెట్ ఎంతంటే?
Royal Challengers Bengaluru

Updated on: May 04, 2024 | 9:50 PM

Royal Challengers Bengaluru vs Gujarat Titans: డూ ఆర్ డై మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు సమష్ఠిగా రాణించారు. గుజరాత్ టైటాన్స్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. శనివారం (మే 04) చిన్న స్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటయ్యింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. వృద్ధిమాన్ సాహా‌ (1), శుభ్‌మన్‌ గిల్‌ (2), సాయి సుదర్శన్‌ (6) నిరాశపర్చగా. షారూఖ్‌ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్‌ (30), రాహుల్ తెవాటియా (35), రషీద్ ఖాన్‌ (18) రాణించడంతో ఆ మాత్రమైనా స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌, యశ్‌ దయాల్‌, విజయ్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా, గ్రీన్ కామెరాన్‌, కర్ణ్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు.

కట్టుదిట్టంగా ఆర్సీబీ బౌలింగ్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ వైషాక్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, ఆకాష్ దీప్, రజత్ పాటిదార్, సుయాష్ ప్రభుదేశాయ్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సందీప్ వారియర్, శరత్ BR, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..