IPL 2024: చెన్నైకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. ఇలాగైతే ఇంటికే

|

May 02, 2024 | 6:17 PM

గతేడాది ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. ఈ పది మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. మొత్తం 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు 4వ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా 10 పాయింట్లతో ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి.

IPL 2024: చెన్నైకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. ఇలాగైతే ఇంటికే
Chennai Super Kings
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 లీగ్ మ్యాచ్‌లు కీలక దశకు చేరుకున్నాంది. అన్ని జట్లు ఇప్పటికే 10 మ్యాచ్‌లు ఆడగా 4 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లే ప్లేఆఫ్‌కు వెళ్లే 4 జట్లను నిర్ణయిస్తారు. గతేడాది ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. ఈ పది మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. మొత్తం 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు 4వ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా 10 పాయింట్లతో ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. కాబట్టి CSK జట్టు తదుపరి 4 మ్యాచ్‌లలో గెలిస్తేనే నేరుగా ప్లే ఆఫ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చెన్నై జట్టుకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. అదేంటంటే.. CSK జట్టు ఆడే తదుపరి మ్యాచ్‌లకు కొంతమంది స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉండడం లేదు. వీరిలో ప్రముఖ పేసర్లు ముస్తాఫిజుర్ రెహమాన్, మతిష్ పతిరానా కూడా ఉన్నారు.

స్వదేశానికి ముస్తాఫిజుర్ రెహ్మాన్..

జింబాబ్వేతో టీ20 సిరీస్ కోసం ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. మే 3 నుంచి బంగ్లాదేశ్-జింబాబ్వే మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ సిరీస్ కారణంగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ CSK జట్టు తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. మరోవైపు మతిష్ పతిరనా, మహిష్ తీక్షణ శ్రీలంకకు తిరిగి వచ్చారు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో ఇద్దరు సీఎస్‌కే ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు లంక ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వదిలి వీసా సంబంధిత పనుల కోసం కొలంబో వెళ్లారు. కాబట్టి ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు.

విజయవకాశాలపై ప్రతికూల ప్రభావం..

అలాగే గత మ్యాచ్‌లో దీపక్ చాహర్ గాయపడటంతో మైదానం వీడాడు. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి రాలేదు. ఫిట్‌నెస్ సమస్యతో బాధపడుతున్న దీపక్ చాహర్ తదుపరి మ్యాచ్‌లో కూడా ఆడడం అనుమానమే. మరో పేసర్ తుషార్ దేశ్‌పాండే జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. ఒకవేళ పూర్తిగా కోలుకోకపోతే తుషార్ కూడా తదుపరి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. అంటే మే 5న పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఐదుగురు బౌలర్లు ఔట్ అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి 4 మ్యాచ్‌ల్లో గెలిస్తేనే నేరుగా ప్లే ఆఫ్‌లోకి ప్రవేశిస్తుంది. కీలక మ్యాచ్‌ల సమయంలో ఈ ఆటగాళ్లు దూరమైతే.. అది సీఎస్‌కే జట్టు విజయవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.