AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs GT, IPL 2024: రాజస్థాన్ తో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్.. కేన్ మామ ప్లేస్‌లో ఆసీస్ పించ్ హిట్టర్

Rajasthan Royals vs Gujarat Titans Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 17వ సీజన్ 24వ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటివరకు రాజస్థాన్‌తో జరిగిన మ్యాచుల్లో గుజరాత్ జట్టే ఆధిపత్యం చెలాయించింది.

RR vs GT, IPL 2024: రాజస్థాన్ తో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్.. కేన్ మామ ప్లేస్‌లో ఆసీస్ పించ్ హిట్టర్
RR vs GT Today IPL Match
Basha Shek
|

Updated on: Apr 10, 2024 | 7:51 PM

Share

Rajasthan Royals vs Gujarat Titans Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 17వ సీజన్ 24వ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటివరకు రాజస్థాన్‌తో జరిగిన మ్యాచుల్లో గుజరాత్ జట్టే ఆధిపత్యం చెలాయించింది. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రాజస్థాన్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, గుజరాత్ నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే ఈ సీజన్‌లో రాజస్థాన్‌ ఇప్పటి వరకు ఓడిపోలేదు. ఈ సీజన్‌లో రాజస్థాన్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. మరోవైపు గుజరాత్ 5 మ్యాచ్‌ల్లో 2 గెలిచింది. మరి ఈ మ్యాచ్ లో నూ రాజస్థాన్ గుజరాత్ పై సత్తా చాటుతుందేమో చూడాలి.

వర్షం కారణంగా టాస్ ఆలస్యం..

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ ), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ ప్లేయర్స్:

రోవ్‌మన్ పావెల్, తనుష్ కోటియన్, శుభమ్ దూబే, కేశవ్ మహారాజ్, నవదీప్ సైనీ

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

శుభ్‌మన్ గిల్ (సి), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, మాథ్యూ వేడ్ (w), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

ఇంపాక్ట్ ప్లేయర్స్:

శరత్ BR, షారుఖ్ ఖాన్, దర్శన్ నల్కండే, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మానవ్ సుతార్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..