
Royal Challengers Bengaluru vs Punjab Kings Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ (RCB vs PBKS) మధ్య జరుగుతుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోగా, పంజాబ్ కింగ్స్ జట్టు విజయంతో శుభారంభం చేసింది. అయితే, RCB వారి సొంత గ్రౌండ్ చిన్నస్వామిలో ఆడుతుంది. దీని కారణంగా వారిదే పైచేయి కావొచ్చు. సొంతగడ్డపై జట్టుకు అద్భుతమైన మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.
ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
చిన్నస్వామి స్టేడియంలో ఎన్నో మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు నిర్వహించారు. మొదట్లో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్, టోర్నమెంట్ జరుగుతున్న కొద్దీ పిచ్ చాలా నెమ్మదిగా మారడంతో స్కోరింగ్ కష్టంగా మారింది. అయితే, పురుషుల ఐపీఎల్ సమయంలో తాజా పిచ్ చూడొచ్చు.
🚨 Toss Update 🚨 @RCBTweets win the toss and elect to bowl against @PunjabKingsIPL.
Follow the Match ▶️ https://t.co/cmauIj3e0o#TATAIPL | #RCBvPBKS pic.twitter.com/WwPzXWZTFM
— IndianPremierLeague (@IPL) March 25, 2024
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ(కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్(కీపర్), అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..