RCB vs GT, IPL 2024: గుజరాత్‌తో డూ ఆర్ డై మ్యాచ్.. టాస్ గెలిచిన ఆర్సీబీ.. టీమ్‌లో ఎవరున్నారంటే?

|

May 04, 2024 | 7:20 PM

Royal Challengers Bengaluru vs Gujarat Titans Confirmed Playing XI in Telugu: ఐపీఎల్- 2024 సీజన్ 52వ మ్యాచ్‌లో భాగంగా శనివారం (మే04) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ రెండు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్.

RCB vs GT, IPL 2024: గుజరాత్‌తో డూ ఆర్ డై మ్యాచ్.. టాస్ గెలిచిన ఆర్సీబీ.. టీమ్‌లో ఎవరున్నారంటే?
RCB vs GT Today IPL Match
Follow us on

Royal Challengers Bengaluru vs Gujarat Titans Confirmed Playing XI in Telugu: ఐపీఎల్- 2024 సీజన్ 52వ మ్యాచ్‌లో భాగంగా శనివారం (మే04) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ రెండు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్. పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ చివరి స్థానంలో ఉన్నప్పటికీ, లెక్కల ఆధారంగా ప్లేఆఫ్ రేసులో ఉంది. మరోవైపు నాకౌట్‌కు చేరుకునే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే గుజరాత్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాల్సిందే. ప్రస్తుతం RCB 10 మ్యాచ్‌లలో ఆరు పాయింట్లతో చివరి స్థానంలో ఉండగా, గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచ్‌లలో ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి గుజరాత్ ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది.

ఇవి కూడా చదవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ వైషాక్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, ఆకాష్ దీప్, రజత్ పాటిదార్, సుయాష్ ప్రభుదేశాయ్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సందీప్ వారియర్, శరత్ BR, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్

 మ్యాచ్ కు ముందు నెట్ ప్రాక్టీస్ లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు.. వీడియో ఇదిగో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..