AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs LSG, IPL 2024: పరువు కోసం గెలవాల్సిందే.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు

Mumbai Indians vs Lucknow Super Giants Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 17వ సీజన్ 67వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్ల కు ఇది ​​14వ మ్యాచ్ అలాగే ఆఖరి గేమ్. అందుకే ఈ మ్యాచ్‌లో గెలిచి విజయంతో ముగించాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి.

MI vs LSG, IPL 2024: పరువు కోసం గెలవాల్సిందే.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
MI vs LSG, IPL 2024
Basha Shek
|

Updated on: May 17, 2024 | 7:34 PM

Share

Mumbai Indians vs Lucknow Super Giants Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 17వ సీజన్ 67వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల కు ఇది ​​14వ మ్యాచ్ అలాగే ఆఖరి గేమ్. అందుకే ఈ మ్యాచ్‌లో గెలిచి విజయంతో ముగించాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. ఈ సీజన్‌లో ముంబై మొత్తం 13 మ్యాచ్‌లు ఆడింది. అందులో  కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది.  7 సార్లు ఓటమిని చవిచూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబై పదో స్థానంలో ఉంది. ముంబై vs లక్నో మధ్య ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్‌లు జరిగాయి. అందులో లక్నో 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ముంబై కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే గెలవగలిగింది.

ఇవి కూడా చదవండి

కాగా లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది.  కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ తీసుకుని లక్నోను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్:

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, నెహాల్ వాద్రా, రొమారియో షెపర్డ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషారా.

ఇంపాక్ట్  ప్లేయర్లు: 

రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI:

కేఎల్ రాహుల్ (కెప్టెన్ & వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్.

ఇంపాక్ట్  ప్లేయర్లు:

నవీన్-ఉల్-హక్, ఆష్టన్ టర్నర్, మణిమారన్ సిద్ధార్థ్, ప్రేరక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..