- Telugu News Photo Gallery Sports photos Akula Sreeja from Telangana selected in Indian Table Tennis Team for Paris Olympics 2024
Paris Olympics 2024: ప్యారిస్ ఒలింపిక్స్‌కు మన తెలంగాణ బిడ్డ.. టీటీ ఈవెంట్‌లో ఆకుల శ్రీజకు స్థానం
ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్ గేమ్స్ కు సమయం ముంచుకొస్తోంది. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా ఈ అంతర్జాతీయ క్రీడలు జరగనున్నాయి. జూలై 26 నుండి మొత్తం 17 రోజుల పాటు (ఆగస్టు 11) వరకు జరిగే ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ లో దాదాపు 10 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.
Updated on: Jul 12, 2024 | 1:22 PM

ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్ గేమ్స్ కు సమయం ముంచుకొస్తోంది. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా ఈ అంతర్జాతీయ క్రీడలు జరగనున్నాయి. జూలై 26 నుండి మొత్తం 17 రోజుల పాటు (ఆగస్టు 11) వరకు జరిగే ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ లో దాదాపు 10 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.

ఇక మన దేశం నుంచి పలువురు క్రీడాకారులు ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. వివిధ క్రీడా విభాగాల్లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను అఖిల భారత టేబుల్ టెన్నిస్ సంఘం (టీటీఎఫ్‌ఐ) గురువారం ప్రకటించింది. ఇందులో రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడనుంది.

శ్రీజ సింగిల్స్, డబుల్స్ ఈవెంట్స్ లోనూ బరిలోకి దిగనుంది. ఈమెతో పాటు సూరత్‌కు చెందిన హర్మీత్ దేశాయ్, రాజ్‌కోట్‌కు చెందిన మానవ్ థాకర్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై కన్నేశారు.

సూరత్‌కు చెందిన హర్మీత్ దేశాయ్ ఆరేళ్ల వయసులో టీటీలో రాకెట్ ని అందుకున్నాడు. భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు, పతకాలు అందించాడు.

టేబుల్ టెన్నిస్ ఈవెంట్ లో భారత జట్టు ఇదే: మహిళల జట్టు: మనిక బత్రా, శ్రీజ, అర్చన కామత్, అహిక ముఖర్జీ (రిజర్వ్). పురుషుల జట్టు: శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, సత్యన్ జ్ఞానశేఖరన్ (రిజర్వ్).