Chennai Super Kings vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ 46వ మ్యాచ్ లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. దీంతో రెండు జట్లూ మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటి వరకు ఇరు జట్లు 20 మ్యాచ్‌లు ఆడాయి. చెన్నై 14 మ్యాచ్‌ల్లో, హైదరాబాద్ 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ రెండోసారి తలపడుతున్నాయి. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్లు మరియు 11 బంతులు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి విజయం సాధించింది. మరి ఈ ఓటమికి చెన్నై ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
🚨 Toss Update 🚨@SunRisers elect to bowl against @ChennaiIPL
Follow the Match ▶️ https://t.co/uZNE6v8QzI#TATAIPL | #CSKvSRH pic.twitter.com/AjWB7qtGwC
— IndianPremierLeague (@IPL) April 28, 2024
అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్, మతీషా పతిరానా.
సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐదాన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్
ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్
Vostunnamu, Chepauk 😎🔥#PlayWithFire #CSKvSRH pic.twitter.com/akb299TQcG
— SunRisers Hyderabad (@SunRisers) April 28, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..