ఐపీఎల్ 2024 సీజన్ లో వరుస విజయాలతో దూసుకెళుతోన్న చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. గతేడాది ఆ జట్టు ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఓ స్టార్ ప్లేయర్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. సీజన్ ప్రథమార్థంలో ఆడడని ఈ డ్యాషింగ్ బ్యాటర్ ఇప్పుడు ఏకంగా సీజన్ నుంచి తప్పుకుని చెన్నైకు బిగ్ షాక్ ఇచ్చాడు. డెవాన్ కాన్వే గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లీగ్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు డెవాన్ కాన్వే బొటన వేలికి గాయం కావడంతో, అతను శస్త్రచికిత్స చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత కొన్ని వారాల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుందని తెలిసింది. దీంతో అతను ఐపీఎల్ 2024 ప్రథమార్థంలో కూడా ఆడలేకపోయాడు. కనీసం ఐపీఎల్ రెండో అర్ధభాగంలో ఈ కివీస్ బ్యాటర్ జట్టులో కనిపిస్తాడని అభిమానులు ఆశించారు. అయితే ఇప్పుడు కాన్వే సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ గ్లీసన్‌ను CSK నియమించుకుంది.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఒక బ్యాటర్ ఐపీఎల్‌కు దూరమైతే అతని స్థానంలో మరో బ్యాటర్ ను జట్టులోకి తీసుకుంటారు. కానీ CSK ఫ్రాంచైజీ, భిన్నంగా ఆలోచించి బ్యాటర్ కు బదులుగా ఒక బౌలర్‌ను జట్టులోకి తీసుకుంది. CSK జట్టులో చేరిన రిచర్డ్ గ్లీసన్ ఫాస్ట్ బౌలర్. 2022లో భారత్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన అరంగేట్రం మ్యాచ్‌లో గ్లీసన్ కేవలం 4 బంతుల్లోనే భారత ముగ్గురు స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌ల వికెట్లు పడగొట్టాడు.రిచర్డ్ గ్లీసన్‌కు ఇది IPL తొలి ఎడిషన్. అయితే అతనికి T20 లీగ్‌లో ఆడిన అనుభవం పుష్కలంగా ఉంది. గ్లీసన్ IPLకి ముందు BBL, PSL, SA20, BPL వంటి మేజర్ T20 లీగ్ లలో ఆడాడు.
DEVON CONWAY RULED OUT OF IPL 2024.
– Richard Gleeson replaces Devon Conway in CSK. 🦁 pic.twitter.com/7KfgYxZ7OX
— Johns. (@CricCrazyJohns) April 18, 2024
ప్రస్తుతం కాన్వే గైర్హాజరీలో, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ కాంబినేషన్ బాగానే రాణిస్తోంది. రిచర్డ్ గ్లీసన్ వచ్చిన తర్వాత అతడిని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకుంటుందా లేదా అనేది చూడాలి
RICHARD GLEESON IS NOW A SUPER KING…!!! 🦁
– Gleeson has replaced Devon Conway in CSK for IPL 2024.pic.twitter.com/HUWFHR33Kh
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 18, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..